తండాలో అగ్ని ప్రమాదం


Thu,May 16, 2019 02:38 AM

లింగంపేట: ఒంటర్‌పల్లి పంచాయతీ పరిధిలోని గట్టుమైసమ్మ తండాలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించి రూ.3లక్షల 23వేల ఆస్తి నష్టం వాటిల్లింది. రెండు నివాస గుడిసెలతో పాటు నాలుగు పశువుల కొట్టాలు కాలిబూడిదయ్యాయి. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఉదయం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి లక్ష్మణ్‌ అతడి సోదరుడు దేవులా గుడిసెలకు నిప్పంటుకుంది. దేవులా నివాస గుడిసెలో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కాట్రోత్‌ లక్ష్మణ్‌, దేవులా నివాస గుడిసెలు, శంకర్‌, సూర్య, చందర్‌, శంకర్‌, బలరాంకు చెందిన పశువుల కొట్టాలు కాలిబూడిదయ్యాయి. లక్ష్మణ్‌ నివాస గుడిసెలోని 60 వేల రూపాయల నగదు, వడ్లు, బియ్యం, వం ట సామగ్రి, పాస్‌పోర్టుతో పాటు ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. దేవులా నివాస గుడిసెలోని లక్ష రూపాయల నగదు, 40 తులాల వెండి, తులం బంగారం, 15 క్వింటా ళ్ల వడ్లు, మూడు క్వింటాళ్ల బియ్యం, బట్టలు వంట సామగ్రి కాలి బూడిదయ్యాయి.

దేవులా నివాస గుడిసెలో ఉన్న సిలిండర్‌ పేలిపోవడంతో మంటలు ఎగిసిపడి సమీపంలోని శంకర్‌, బలరాం, సూర్య, చందర్‌ పశువుల కొట్టాల కు నిప్పంటుకుంది. దీంతో రెండు నివాస గుడిసెలతో పాటు నాలుగు పశువుల కొ ట్టాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. అగ్ని ప్రమాదం సంభవించిన విషయాన్ని ఎల్లారెడ్డి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా తండాకు చేరుకుని మంటలను ఆర్పి వేశారు. అగ్నిమాపక వాహనం వచ్చే వరకు ఒంటర్‌పల్లి గ్రామస్తులతో పాటు గిరిజనులు మంటలను ఆర్పివేశారు. అగ్ని ప్రమాదం కారణంగా 3లక్షల 23వేల రూపాయల ఆస్తి నష్టం వాట్లిందని బాధితులు వాపోయారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్‌ రామేశ్వర్‌, గిర్దావర్‌ సుభాష్‌, వీఆర్వో సత్యనారాయణ, ఏఎస్సై రాజేశ్వర్‌ సందర్శించి పంచనామా నిర్వహించారు. బాధితులకు తక్షణ సాయంగా 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...