తుది విడత పోలింగ్‌ ప్రశాంతం


Wed,May 15, 2019 02:58 AM

ఖలీల్‌వాడి / మోర్తాడ్‌ / నందిపేట్‌ / ఆర్మూర్‌, నమస్తే తెలంగాణ : ఆర్మూర్‌ డివిజన్‌లో తుది విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. మంగళవారం ఆర్మూర్‌ మండలంలోని అంకాపూర్‌, ఆలూర్‌ , నందిపేట్‌ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓటిం గ్‌ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. ఓటర్లకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆర్మూర్‌ డివిజన్‌లో పదకొండు మండలాల్లో జడ్పీటీసీలకు, 124 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయని, ఎంపీటీసీలు ఏడు ఏకగ్రీవం ఎన్నికైనట్లు మిగతా 117 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. 11 జడ్పీటీసీ స్థానాలకు నలభై మంది అభ్యర్థులు, 117 ఎంపీటీసీ స్థానాలకు 372 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. 639 పోలింగ్‌ కేంద్రా లు ఏర్పాటు చేసిన వాటిలో సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేందుకు సూక్ష్మ పరిశీలకులు వెబ్‌ కాస్టిం గ్‌, వీడియోగ్రఫీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఎన్నికల నిర్వాహకులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల్లో చల్లని తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, దివ్యాంగులకు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకునేలావీల్‌చైర్‌, రవాణా సౌకర్యాలను కల్పించామన్నారు. జిల్లాలో మూడు విడతలుగా జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఎ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ముగిశాయని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కలెక్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఓటర్లు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది, పోలింగ్‌ అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం మరువలేనిదన్నారు. మంగళవారం సాయంత్రం మోర్తాడ్‌ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌, మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఓటింగ్‌ సమయం పూర్తి కాగానే ఓటర్లు ఎవరు లేని పక్షంలో బ్యాలెట్‌ బాక్సులను ఏజెంట్ల సమక్షంలో సీల్‌ చేసే చర్యల్లో భాగంగా పోలింగ్‌ ఏజెంట్లతో తప్పనిసరిగా సంతకాలు తీసుకోవాలని పోలింగ్‌ అధికారులకు కలెక్టర్‌ ఆదేశించారు. వేల్పూర్‌ మండలంలోని అంక్సాపూర్‌లోని ఆరు పోలింగ్‌ కేంద్రాల్లో సీల్‌ చేసే ప్రక్రియను పరిశీలించి జరిగిన ఓటింగ్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్మూర్‌ డివిజన్‌ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు మైనార్టీ బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఏర్పాట్లు చేసినందున స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ గదుల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆర్డీవోను ఆదేశించారు. మండలాల నుంచి రాత్రి వరకు బ్యాలెట్‌ బాక్సులు వచ్చే అవకాశం ఉన్నందున ఆలోగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని, కంట్రోల్‌ రూం, సీసీ కెమెరాల ఫుటేజిని కలెక్టర్‌ పరిశీలించారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...