పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల


Wed,May 15, 2019 02:56 AM

ఇందూరు : పాలిటెక్నిక్‌ డిప్లొ మా కోర్సుల్లో 2019 - 20 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్‌ పాలిసెట్‌ - 2019 కౌన్సిల్‌ షెడ్యూల్‌ విడుదలైందని పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీ రాంకుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 నుంచి 18వరకు ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు. కౌన్సెలింగ్‌ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ (రిజిస్ట్రేష న్‌), ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించేందు కు మంగళవారం నుంచి అవకా శం కల్పించామని తెలిపారు. బాలుర ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో హెల్ప్‌లైన్‌ సెంటర్‌ (సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాన్ని) ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. స్లాట్‌ బుకింగ్‌, వివరాలకు https:// tspolycet.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.
స్లాట్‌ బుకింగ్‌ ఇలా..
https://tspolycet.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి విద్యార్థి ప్రాథమిక సమాచారం నింపి పదో తరగతి హాల్‌ టికెట్‌ నంబర్‌, హాల్‌ టికెట్‌ పై ఉన్న ఐసీఆర్‌ నంబర్‌, పుట్టిన తేదీ, టీఎస్‌ పాలిసెట్‌ హాల్‌టికెట్‌ వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో ధ్రువపత్రాల పరిశీలన కోసం ఏ రోజుకు ఆరోజు స్లాబ్‌ ఉద యం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతి గంటకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థికి అనువైన సమయం ఎంచుకుంటే సమయానికి అనుగుణంగా కౌన్సెలింగ్‌కు వెళ్లవచ్చు. స్లాట్‌ బుకింగ్‌ ఫీజును క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌లో చెల్లించాలి. స్లాబ్‌ బుకింగ్‌లో నమోదు చేసిన తేదీ, సమయం ప్రకారం ఆ రోజున అన్ని సర్టిఫికెట్లతో కౌన్సెంగ్‌కు హాజరు కావాలి.
స్లాట్‌ బుకింగ్‌ ఫీజు..
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు విధిగా ఫీజును ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 300, బీసీ, ఓసీ ఇతర కేటగిరీకి చెందిన విద్యార్థులు రూ. 600 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి.
కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు ఇవే..
టీఎస్‌ పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకొని హాజరయ్యే విద్యార్థులు విధిగా తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలతో హాజరు కావాలి. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న కాపీ, టీఎస్‌ పాలిటెక్నిక్‌ -2019 హాల్‌టికెట్‌, ర్యాంక్‌ కార్డు, ఎస్సెస్సీ మార్కుల మెమో, టీసీ, 1 జనవరి, 2019 అనంతరం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డును తీసుకుని వెళ్లాలి.
షెడ్యూల్‌ ఇలా..
ఈ నెల 14 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌, ప్రాథమిక సమాచారం నమోదుకు, అవకాశం, స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న వారు మాత్రమే సర్టిఫికెట్‌ పరిశీలనకు హాజరు కావాలి. ఈ నెల 15 నుంచి 18 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, ఈ నెల 15 నుంచి 19 వరకు కళాశాల ఎంపికకు ఆన్‌లైన్‌ల్లో వెబ్‌ ఆప్షన్ల నమోదు, ఈ నెల 22 సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌, జూన్‌ ఒకటిన కళాశాలల్లో రిపోర్టింగ్‌ ఉంటుంది. జూన్‌ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...