ఘనంగా కన్యకా పరమేశ్వరి జన్మదినం


Wed,May 15, 2019 02:56 AM

ఖలీల్‌వాడి : నగరంలోని కిషన్‌గంజ్‌లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ, ఆర్యవైశ్య మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి వస్ర్తాలంకరణ, అఖండ దీపారాధన, గోపుజ, కదంబ వృక్ష పూజ, ధ్వజారోహణం, అన్నపూర్ణ మాత పూజ, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, సప్తశతి పారాయణం నిర్వహించారు. సామూహిక దీపారాధన, కుంకుమార్చన, నామకరణ మహోత్సవం చేపట్టారు. ప్రముఖ వ్యాపారవేత్త ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని అమ్మవారి కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను సన్మానించారు. చకినాల సిద్ధ రాజేశ్వర్‌ గుప్తా, బిగాల సువర్ణ కృష్ణమూర్తి, ధన్‌పాల్‌ గీత నారాయణ గుప్తా, పెండ్యాల శ్రీనివాస్‌ గుప్తా, పెద్ది రాజేందర్‌ గుప్తా, ఇల్లెందుల ప్రభాకర్‌ గుప్తా, దొంతుల అంజయ్య గుప్తా, అర్చకులు వెలేటీ గౌరీ శంకర శర్మ, దుర్గా పరమేశ్వర్‌ శర్మ, సుహాసినులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...