ఒకరిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి


Wed,May 15, 2019 02:56 AM

మాక్లూర్‌ : మండలంలోని అమ్రాద్‌ గ్రామానికి చెందిన కొంతం భూమన్నపై గుర్తు తెలియని వ్య క్తులు దాడి చేసినట్లు ఎస్సై సాయినాథ్‌ తెలిపా రు. ఆయన తెలిపిన సంఘటకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొంతం భూమన్న సోమవారం రాత్రి ఇంట్లో భోజనం చేసి ఊరి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో వరి ధాన్యం కుప్ప దగ్గర పడుకోవడానికి వెళ్లినట్లు తెలిపారు. ఎవరో గుర్తు తెలియని దుండగులు ఆయన తలపైన బండరాయితో మొది పారిపోయారని అన్నారు. జరిగిన సంఘటన స్థలం పక్కనే భూమన్న కొత్త ఇంటి నిర్మాణం చేపడుతున్నాడని, ఉదయం ఇంటిని నిర్మాణం చేస్తున్న మేస్త్రి అక్కడికి వచ్చి చూసే సరికి గాయాలతో భూమన్నను చూసి భార్య కొంతం సావిత్రి కి సమాచారం అందిచాడని అన్నారు. వెంటనే అక్కడికి వచ్చిన భార్య, ఇతర కుటుంబ సభ్యు లు కొనఊపిరితో ఉన్న భూమన్నను జిల్లా కేం ద్రంలోని ప్రైవేటు దవాఖానకు తరలించగా చికి త్స పొందుతున్నాడని ఆరోగ్యం నిలకడగా ఉంద ని తెలిపారు. భార్య సావిత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తపై హత్యాయత్నం చేశా రని తెలిపింది. హత్యాయత్నం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే ఘ టనకు సంబంధించిన నిందితులను పట్టుకుంటామని ఎస్సై పేర్కొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...