అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలు సీజ్‌


Wed,May 15, 2019 02:55 AM

శక్కర్‌నగర్‌ : బోధన్‌ మండలంలోని మందర్నా, హున్సా, సిద్దాపూర్‌ శివార్ల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న పలు వాహనాలను సీజ్‌ చేసి తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. సోమవారం అర్థరాత్రి దాటాక అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తహసీల్దార్‌ కేతావత్‌ రామకృష్ణ, పలువురు వీఆర్వోలు, వీఆర్‌ఏలతో కలిసి ఆకస్మికం గా తనిఖీలు చేపట్టారు. మంధర్నా, హున్సా ప్రాంతం నుం చి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న తొమ్మిది వాహనాలు, సిద్దాపూర్‌ శివారు నుంచి ఇసుక తరలిస్తున్న మరో వాహనాన్ని గుర్తించారు. ఇసుక తరలింపు విషయంలో ఎలాంటి అనుమతులు, పత్రాలు లేకపోవడం తో ఐదు ఐచర్‌ వాహనాలు, రెండు ట్రాక్టర్లు, రెండు బొలే రో వాహనాలు, ఓ ట్రాలీ ఆటోలను స్వాధీనం చేసుకున్నా రు. ఈ వాహనాలను ఇసుకతో తహసీల్‌ కార్యాలయంలో సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ రామకృష్ణ మా ట్లాడతూ నిత్యం జరుపుతున్న తనిఖీల్లో భాగంగానే ఈ త నిఖీలు నిర్వహించామని తెలిపారు. ఈ వాహనాలపై, ఇసుక తరలిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. మరోమారు ఇవే వాహనాల్లో ఇసుక తరలిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని తహసీల్దార్‌ రామకృష్ణ హెచ్చరించారు.

తహసీల్దార్‌ స్థానికంగా లేడ నే సమాచారంతో ఇసుక తరలింపునకు యత్నాలు?
రెండు రోజులుగా సెలవులు కావడంతో తహసీల్దార్‌ స్థానికంగా లేడనే సమాచారంతోనే ఇసుక అక్రమ రవాణాకు పాల్పడి ఉంటారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రవాణాలో పూర్తి నియంత్రణ చర్యలు చేపడుతున్న తహసీల్దార్‌ రామకృష్ణ స్థానికంగా లేని విషయం తెలుసుకున్న పలువురు ఇసుక అక్రమ రవాణా చేసే వ్యక్తులు ఈ చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. తహసీల్దార్‌ లేడనే విషయం బయ టి వ్యక్తులకు ఎలా తెలుస్తుందనే విషయంలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా ఒకే రోజు రాత్రి 10 అక్రమ ఇసుక రవాణా చేసే వాహనాలు సీజ్‌ చేయడంపై అక్రమ ఇసుక రవాణాదారుల గుండెల్లో హడలెత్తించిందనే చెప్పవచ్చు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...