విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి దుర్మరణం


Wed,May 15, 2019 02:55 AM

నిజామాబాద్‌ క్రైం : కరెంట్‌ బోర్డులో కనెక్షన్‌ పెడుతూ ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగిలి ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్డు ప్రాంతంలో వెలుగు చూసింది. స్థానిక వర్ని రోడ్డులోని ఐటీఐ ప్రాంతంలో నివాసం ఉంటున్న గైక్వాడ్‌ బాలాజీ(36) అనే వ్యక్తి వృత్తి రీత్యా మున్సిపాలిటిలో ఔట్‌ సోర్సింగ్‌ వర్కర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో బాలాజీ ఇంట్లోని టీవీ స్టాండ్‌కు కరెంట్‌ బోర్డు కట్టి, దానికి సెల్‌ఫోన్‌లో పాటలు వినడానికి ఆంప్లిఫైర్‌ కనెక్షన్‌ విద్యుత్‌ బోర్డులో పెడుతుండగా కరెంట్‌ షాక్‌ తగిలింది. దీంతో ఆయన గట్టిగా అరుస్తు పడిపోయాడు. దీనిని గమనించిన అతని భార్య గైక్వాడ్‌ మమత వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విద్యుత్‌ షాక్‌ తగలడంతో అతనికి ఛాతీ పైన, కాళ్లకు, చేతులకు కాలిన గాయాలయ్యాయి. అనంతరం దవాఖానలో చికిత్స పొందుతున్న బాలాజీ కొద్ది సమయానికి మృతి చెందినట్లు దవాఖాన వర్గాలు పేర్కొన్నారు. ఈ సంఘటనపై మృతుడి భార్య మమత సంబంధిత రెండో టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...