రిజల్స్‌లో రికార్డు


Tue,May 14, 2019 04:55 AM

-పదిలో 97.20 శాతం
ఉత్తీర్ణత నమోదు
-జిల్లా చరిత్రలోనే ఇంత ఉత్తీర్ణత తొలిసారి..
-రాష్ట్రంలో జిల్లాకు ఎనిమిదో స్థానం
-గతేడాది 93.01శాతం ఉత్తీర్ణత.. నాలుగో స్థానం
-10/10 జీపీఏ సాధించిన 142 మంది సరు విద్యార్థులు
-వందశాతం ఉత్తీర్ణత సాధించిన 202 ప్రభుత్వ పాఠశాలలు
ఇందూరు: పదో తరగతి ఫలితాల్లో జిల్లా మెరుగైన ఉత్తీర్ణత శాతాన్ని సాధించింది. సోమవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే మెరుగైన ఉత్తీర్ణతతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. కాగా, గతేడాదితో పోలిస్తే జిల్లా ర్యాంకుల్లో వెనుకబడింది. గతేడాది రాష్ట్ర స్థాయిలో జిల్లా నాలుగో స్థానంలో నిలవగా.. ఈ ఏడాది ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నది. ఉత్తీర్ణత శాతం పరంగా గతేడాది 93.01 ఉత్తీర్ణత శాతం సాధించగా.. ఈ ఏడాది 97.20 శాతం ఉత్తీర్ణత సాధించింది.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం మెరుగైంది. 2018-19 పదో తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లావ్యాప్తంగా మొత్తం 23,536 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 22,876 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 659 మంది ఫెయిలయ్యారు. ఈ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లోని 142 మంది విద్యార్థులు 10/10 జీపీఏలు సాధించినట్లు డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు. 202 ప్రభుత్వ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయని ఆయన తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పది జీపీఏలు ఇలా...
జిల్లాలోని మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలలో ఒకటి, ఎం జేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ పాఠశాలలు రెండు, ఎంపీపీ, జడ్పీపీపీ పాఠశాలలు 91, ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు 21, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు 318, టీఎస్ మోడల్ స్కూల్ 21, టీఎస్‌ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ స్కూల్స్‌లో రెండు, టీఎస్ ఆర్‌ఈఐ సొసైటీ పాఠశాలు 4 చొప్పున జిల్లాలో మొత్తం 460 మంది విద్యార్థులు 10/10 జీపీఏలు సాధించారని డీఈవో తెలిపారు. పాసైన విద్యార్థులు, తల్లిదండ్రు లను కలెక్టర్ రామ్మోహన్‌రావు అభినందించారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...