నేటితో తెర!


Sun,May 12, 2019 02:14 AM

ఇందూరు: మొదటి, రెండో విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా.. మూడో విడత ఎన్నికలకు సంబంధించి ప్రచారం ఆదివారం (నేడు) ముగియనుంది. మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 30న విడుదల కాగా.. నామినేషన్ల ప్రక్రియ 30 నుంచి ప్రారంభమైంది. మే 2 వరకు గడువు నిర్ణయించారు. మే 3న పరిశీలన, మే 6వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. మూడో విడత పోలింగ్ ప్రక్రియ ఈనెల 14న ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 124 ఎంపీటీసీ స్థానాలు, 11 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆర్మూర్ డివిజన్‌లోని ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, జక్రాన్‌పల్లి, కమ్మర్‌పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్లలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా, అన్ని పార్టీలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ప్రచార గడువు సమీపిస్తుండటంతో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్, బోధన్ రెవెన్యూ డివిజన్‌లలో పరిషత్ ఎన్నికలు ముగిసాయి.

ఈ మూడు విడతలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఈనెల 27న చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆయా డివిజన్లలో చేపట్టనున్నారు. మండలానికో జడ్పీటీసీ రిటర్నింగ్ అధికారి, మూడు ఎంపీటీసీ స్థానాలకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని అధికారులు నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఈనెల 27 వరకు కొనసాగనుంది. ప్రచార పర్వం ముగియనుండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యుహాలు వేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీకి పోటి చేస్తున్న అభ్యర్థులు కులసంఘాలు, మహిళా సంఘాలను కలిసి మద్దతు కూడగడుతున్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో, మండలాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...