కాయ్ రాజా.. కాయ్


Sun,May 12, 2019 02:12 AM

శక్కర్‌నగర్: మార్చిలో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్‌లు ఈనెల 12న సాయంత్రం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌తో ముగియనున్నాయి. మార్చి 23న చెన్నయ్ సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌తో ప్రారంభమైంది. నెల 20 రోజుల పాటు 60మ్యాచ్‌లు కొనసాగాయి. ఈ మ్యాచ్‌ల్లో ఎక్కడ చూసినా వయసుతో సంబంధం లేకుండా బెట్టింగ్‌లతో పలువురు తీరిక లేకుండా కాలం గడిపారు. ఈ మ్యాచ్‌ల్లో బెట్టింగ్‌లో జోరుగా సాగింది. బోధన్ పట్టణమే కాకుండా డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో యువత బెట్టింగ్‌లో తలా మునకలయ్యారు. ఈనెల 12న చివరి ఫైనల్ మ్యాచ్ కావడంతో శనివారం సాయంత్రం నుంచే బెట్టింగ్ రాజాలు తమ బెట్టింగ్‌లను ప్రారంభించారు. డబ్బులు రెండింతలు, మూడింతలు ఇచ్చేందుకు, తీసుకునేందుకు పందేల జోరు కొనసాగింది.

ఈ బెట్టింగ్ వ్యవహారం బోధన్‌లో కలకలం రేపుతున్నది. బోధన్‌లోని పలు ప్రాంతాలు ఇందుకు అడ్డాలుగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా క్రికెట్ మ్యాచ్‌లకు అడ్డాలను ఏర్పాటు చేసి అర్ధరాత్రి వరకు కాలం గడిపేందుకు అనుకూలంగా సదరు ప్రాంతాల్లో టేబుళ్లు, బెంచీలు ఏర్పాటు చేశారు. బోధన్ పట్టణంలోని రాకాసీపేట్ రైల్వేస్టేషన్, శక్కర్‌నగర్ చౌరస్తాలోని వ్యాపార ప్రాంతం, శక్కర్‌నగర్ రాంమందిరం ప్రాంతంలో, ఆచన్‌పల్లి ప్రాంతంలోని ఓ క్రాసింగ్ వద్ద బెట్టింగ్‌లో కోసం అడ్డాలు కొనసాగాయి. బోధన్‌లో జరిగిన రెండు బెట్టింగ్ ఘటనల్లో ఇటీవల ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిసింది. బోధన్ డివిజన్‌లోని ఎడపల్లి, రెంజల్, రుద్రూర్, వర్నితో పాటు పలు మండలాల్లో బెట్టింగ్‌లో జోరు కొనసాగింది. 12న చివరి మ్యాచ్ కావడంతో డివిజన్‌లోని అన్ని ప్రాంతాల్లో బెట్టింగ్ రాజాలు తమ ఇండ్లను విడిచి బెట్టింగ్‌పై దృష్టి సారించి, అడ్డాల్లో మకాం వేసేందుకు నిర్ణయించారు. పోలీసులు బెట్టింగ్‌లపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...