ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరికలు


Sun,May 12, 2019 02:12 AM

నందిపేట్ రూరల్ : నందిపేట్ మండలం కుద్వాన్‌పూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది నాయకులు తమ పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా భావించి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన నాయకులతో పాటు పాత నాయకుల సహకారంతో కుద్వాన్‌పూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని పాత, కొత్త నాయకులందరూ కలిసి కట్టుగా పనిచేసి టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి అన్నాగౌడ్ ప్రవీణ్‌గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో కాంగ్రెస్ నాయకులు తోట మహేశ్, కుస్తపురం వెంకటి, లోలం మోహన్‌రెడ్డి, లోలం చిన్నారెడ్డి, పెద్ద రాజేశ్వర్, చిన్న రాజేశ్వర్, ఉదిగిరి మల్కారెడ్డి, మమ్మయి సాయిలు గారికి గులాబీ కాండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి అన్నాగౌడ్ ప్రవీణ్‌గౌడ్, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చిన్న సాయిలు, సర్పంచ్ ఎర్రోళ్ల సాగర్, నాయకులు నవీన్‌గౌడ్, పోశెట్టి, లక్ష్మణ్ పాల్గొన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...