గ్యాస్ లీకై బట్టల దుకాణం దగ్ధం


Sun,May 12, 2019 02:12 AM

రెంజల్ : మండలంలోని సాటాపూర్ గ్రామం తెలంగాణ చౌరస్తా వ ద్ద ఉన్న రుద్ర డ్రెస్సెస్, జువెలర్స్‌లో శనివారం ఉదయం గ్యాస్ లీక్ కావడంతో దుకాణంలోని బట్టలు, పర్నీచర్ పూర్తిగా కాలిబూడిదైన సంఘటనలో సుమారు రూ. లక్షా 80 వేల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు అమోల్ తెలిపారు. బోధన్ మండలం చిన్న మావంది గ్రామానికి చెందిన అమోల్ అనే యువకుడు సాటాపూర్ తెలంగాణ చౌరస్తా మలుపు వద్ద బట్టలు,జువెలర్స్ దుకాణాన్ని వారం రోజుల క్రితం ప్రారంభించారు. నీరు పోసిన బంగారంపై గ్యాస్ సహాయంతో అతికించేందుకు ఉపయోగించిన చిన్న గ్యాస్ సిలిండర్ అకస్మత్తుగా లీకై మంటలు దుకాణం మొత్తం వ్యాపించాయి. అప్రమత్తమైన దు కాణం యజమాని బయటకు పరుగులు తీయడంతో ప్రమాదం త ప్పింది.

దుకాణంలో ఉన్న విలువైన బట్టలు, ఫర్నీచర్ పూర్తిగా కా లిపోయినట్లు బాధితుడు తెలిపాడు. మంటలు చెలరేగి పోవడంతో గమనించిన చుట్టు పక్కల వారు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందిం చారు. బోధన్ అగ్ని మాపక శకటం అక్కడికి చేరుకొని సిబ్బంది సహా యంతో మంటలను ఆర్పివేశారు. అప్పటికే పెద్ద మొత్తంలో కాలిబు డిదైంది. పక్కనేగల రాయల్ ఫుట్‌వైర్ దుకాణం వైరింగ్ సైతం కా లిపోయింది. గ్యాస్ లీక్ అయిన ఘటనలో సూమారు రూ. లక్షా 80 వేల నష్టం వాటిల్లినట్లు అగ్ని మాపక శకటం అధికారులు తమ పం చనామా నివేధికలో అంచనా వేశారు. దగ్ధమైన బట్టలు, బంగారం దుకాణాన్ని ప్రారంభించిన వారం రోజుల్లోనే ఇలాంటి సంఘటన లో ఎదురవడంతో బాధిత కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విల పించారు.

142
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...