ఐదు కిలోల ఎండు గంజాయి పట్టివేత


Sun,May 12, 2019 02:11 AM

నిజామాబాద్ క్రైం : జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృం దం శనివారం సాయంత్రం దాడి నిర్వహించిన్నట్లు సమాచారం. రైల్వే స్టేషన్ ఏరియాలో ఓ వ్యక్తి అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం దాడి చేశారు. దీంతో అక్రమంగా తరలిస్తున్న సుమారు ఐదు కిలోల ఎండు గంజా యి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. గం జాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం గంజాయి తరలిస్తు పట్టుబడిన వ్యక్తి వద్ద నుంచి మరింతగా సమాచారం రాబటేందుకు సంబంధిత ఎక్సైజ్ అధికారు లు దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అయితే పట్టుబడిన సదరు వ్యక్తి గంజాయి ఏ ప్రాంతం నుంచి తరలిస్తున్నది, ఇంకా గంజా యి నిలువలు ఎక్కడ ఉన్నాయనే పూర్తి స మాచారం తెలుసుకునేందుకు విచారణ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...