మనోళ్ల సత్తా..


Sat,May 11, 2019 01:29 AM

-ఆర్మూర్‌లో ముగిసిన జాతీయస్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలు
-బాలికల్లో విన్నర్‌గా, బాలురలో రన్నర్‌గా తెలంగాణ

ఆర్మూర్, నమస్తే తెలంగాణ: ఆర్మూర్‌లో మూడు రోజులుగా నిర్వహించిన జాతీయస్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలబాలికల పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీల్లో తెలంగాణ బాల, బాలికల జట్లు అద్భుత ప్రతిభతో బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో, బాలుర విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచాయి. గురుకులాల సొసైటీ ప్రాంతీయ అధికారిణి సింధు ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. క్రీడల్లో ఓటమి చెందినవారు నిరుత్సాహానికి గురికావద్దని, గెలిచినవారు అదే విజయస్ఫూర్తితో ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు.

ఆర్మూర్‌లో మూడు రోజులుగా నిర్వహించిన బాలబాలికల జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ పోటీల్లో తెలంగాణ బాలబాలికల జట్లు అద్భుత ప్రతిభతో బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో, బాలుర విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచాయి. బహుమతులు ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురుకులాల సొసైటీ ప్రాంతీయ అధికారిణి సింధు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... క్రీడల్లో గెలుపోటాములు సహజమన్నారు. క్రీడల్లో ఓటమి చెందిన వారు నిరుత్సాహానికి గురికావద్దని, గెలిచిన వారు అదే విజయస్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు.

బిక్కనూరు, సుద్ధపల్లిలోని గురుకుల పాఠశాలల్లో రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అకాడమీలు గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడంతో రాష్ట్ర జట్టులో ఎక్కువ మంది గురుకుల విద్యార్థులు చోటు సంపాదించారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సాఫ్ట్‌బాల్ క్రీడల్లో రాణిస్తున్న అర్చన, వంశికను మిగతా విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన రాజస్థాన్, ద్వితీయ స్థానంలో నిలిచిన తెలంగాణ, బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన తెలంగాణ, ద్వితీయ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ జట్లకు షీల్డులను, జ్ఞాపికలను ప్రదానం చేశారు.

కార్యక్రమంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సీఈవో ప్రవీణ్, అశోకర్, బాల్‌రాజు మోమోరియల్ దవాఖాన వైద్యుడు రాకేశ్, రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి కే.శోభన్‌బాబు, స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అశోక్, స్వేరోస్ జిల్లా కార్యదర్శి సాయన్న, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పెంట జలంధర్, సాఫ్ట్‌బాల్ జిల్లా చైర్మన్ బద్ధం లింగారెడ్డి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్స్ శ్రీనివాస్, వినోద్ సౌడ, వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి మల్లేశ్‌గౌడ్, సాఫ్ట్‌బాల్ జిల్లా కార్యదర్శి ఏం.గంగామోహన్, వివిధ రాష్ర్టాల సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శులు, టోర్నీ నిర్వాహకులు, పీఈటీలు పాల్గొన్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...