మీ భూమి- మీ పట్టాలుకు విశేష స్పందన


Sat,May 11, 2019 01:23 AM

నిజామాబాద్ రూరల్ : రైతుల భూసమస్యలు పరిష్కరించాలనే ముఖ్య ఉద్దేశంతో నిజామాబా ద్ ఆర్డీవో వెంకటేశ్వర్లు ఇటీవల శ్రీకారం చుట్టిన మీ భూమి - మీ పట్టాలు కార్యక్రమానికి విశే ష స్పందన లభిస్తున్నది. శుక్రవారం నిజామాబాద్ రూరల్ మండల తహసీల్ కార్యాలయ ఆ వరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్డీ వో హాజరై రైతు సమస్యలు తెలుసుకున్నారు. వి విధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు, తమ భూ ములకు సంబంధించిన సమస్యలను ఆర్డీవో దృ ష్టికి తీసుకొచ్చారు. మొత్తం 86మంది రైతులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 52 దరఖాస్తుల సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కారం చూ పారు. భూములకు సంబంధించిన 1బీ బుక్‌లో, పహాణీలో ఆన్‌లైన్ చేసి కొందరికీ పాస్‌బుక్‌లు, మరికొందరికీ ఆర్డర్ కాపీలను ఆర్డీవో అందజేశారు.

ఏండ్లు, నెలల తరబడి తహసీల్ కార్యాల యం చుట్టూ తిరిగినా, తమ సమస్యలకు పరిష్కారం దొరకలేదని.. ఈ రోజు ఆర్డీవో సార్ స్వయంగా మా సమస్యలను విని వెంటనే పరిష్కరించడం ఆనందంగా ఉందని పాస్‌బుక్‌లు అందుకున్న రైతులు అన్నారు. పాస్‌బుక్‌లు, ఆర్డ ర్ కాపీలు అందుకున్న రైతుల ముఖాల్లో సంతో షం వెల్లివిరిసినట్లయింది. మిగతా 34 దరఖాస్తుల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని ఆర్డీవో తహసీల్దార్‌ను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో భూముల సర్వే జరిపి సరిచేయాల్సి ఉం దని తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ మండల తహసీల్దార్ జ్వాలగిరిరావు, ఆర్డీవో కార్యాలయ సూపరింటెండెంట్ ప్రశాంత్‌కుమార్, డిచ్‌పల్లి మండల డిప్యూటీ తహసీల్దా ర్ వేణుగోపాల్, మండల సర్వేయర్ స్వప్న, గిర్ధావర్ సంతోష్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ భూ పతి ప్రభు, వీఆర్వోలు సుమన్, ప్రవీణ్ కుమా ర్, స్రవంతి, సుధారాణి, అనురాధ, రైతులు తదితరులు పాల్గొన్నారు.

రైతుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రభుత్వం : ఆర్డీవో వెంకటేశ్వర్లు
ఆరుగాలం శ్రమించి పంటల సాగు చేస్తున్న రై తాంగ శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని నిజామాబాద్ ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎ దుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి భూ రికార్డుల ప్రక్షాళన, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ఎంతగానో దోహదపడిందన్నా రు. పంట పెట్టుబడి సహాయం, రైతుబంధు పథ కం, బీమా వంటి పథకాలు రైతుల అభ్యున్నతికి ప్రయోజనం చేకూరుస్తున్నాయని తెలిపారు. ఇంకా మిగిలిన ఉన్న చిన్నచిన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మీ భూమి - మీ పట్టాలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భూ సమస్యలు కలిగి ఉన్న రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...