మోడీపై ఎంపీగా పోటీ చేస్తున్న రైతుకు సన్మానం


Sat,May 11, 2019 01:23 AM

ఏర్గట్ల : ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఎంపీ స్థానానికి దేశ ప్రధాని మోదీపై పోటీ చేస్తున్న ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన సున్నపు ఇస్తారిని పసుపు రైతు ఉద్యమ నాయకుడు కోటపాటి నర్సింహా నాయుడు స్థానిక రైతులతో కలిసి ఏర్గట్లలో సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నుంచి 50 మంది రైతులు, కేరళా నుంచి నలుగురు రైతులు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పోటీ చేస్తూ నామినేషన్‌న్లు వేయగా అందులో 53 మంది రైతుల నామినేషన్లు తిరస్కరించారని ఆయన అన్నారు. కేరళ, తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకే ఒక్క రైతు సున్నపు ఇస్తారి నరేంద్రమోదీపై పోటీలో ఉన్నాడని అన్నారు. ఈ పోటీ పసుపు రైతులకు మద్దతు తెలపడం కోసమేనని ఆయన అన్నారు. పసుపు రైతుల జీవితాలు బాగు పడాలంటే కేంద్రంలో ఏర్పడే ఏ ప్రభుత్వం అయినా నిజామాబాద్ జిల్లాలో గుర్తించిన స్థలంలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలనేది పసుపు రైతుల ప్రధాన డిమాండ్ అని అన్నారు. కార్యక్రమంలో వారణాసిలో ప్రధానిపై నామినేషన్లు వేసిన పసుపు రైతులు తుపాకుల శ్రీనివాస్ గౌడ్, పెద్ద ముత్తెన్న, ఈరపట్నం నరేశ్, బాబులు, జుంగాల గంగాధర్, బర్మ నరేశ్, మెరుగు మహేందర్, సున్నపు పెద్ద గంగయ్య, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు దండెవోయిన సంతోష్, సభ్యులు కొలిప్యాక రవి, పసుపు రైతు ఉద్యమ సభ్యులు కుంట గంగామోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...