నీలాలో లైవ్ వెబ్‌కాస్టింగ్‌ను పరిశీలించిన కలెక్టర్


Sat,May 11, 2019 01:13 AM

రెంజల్ : మండలంలోని సాటాపూర్, నీలా పోలింగ్ కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ రామ్మోహన్‌రావు పరిశీలించారు. అనంతరం నీలాలో కలెక్టర్ రామ్మోహన్‌రావు విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. గతంలో చోటుచేసుకున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని సున్నితమైన నీలా గ్రామం పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన లైవ్ వెబ్‌కాస్టింగ్‌ను కలెక్టర్ రామ్మోహన్‌రావు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రాఫర్, మైక్రో అబ్జర్వర్‌లను నియమించినట్లు తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ అసదుల్లాఖాన్,ఎంపీడీవో చంద్రశేఖర్, తదితరులు ఉన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...