ఇంత నిర్లక్ష్యమా..


Sat,May 11, 2019 01:12 AM

-పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
కోటగిరి : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ రామోహ్మన్‌రావు పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని క్షుణంగా తనిఖీ చేశారు. కలెక్టర్ తనిఖీ సమయంలో పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ అపరేటర్లు ఒక్కరూ కూడా లేకపోవడంతో ఎంపీడీవో, తహసీల్దార్‌పై సీరియస్ అయ్యారు. పోలింగ్ కేంద్రాల నిర్వహణపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల్లోనే వేస్ట్ స్లిప్పులు పాడేయడం, డస్ట్‌బిన్ ఏర్పాటు చేయక పోవడంతో అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లకు గుర్తింపు కార్డులపై ఫోటోలు లేకపోవడంపై పోలింగ్ అధికారులపై మండిపడ్డారు. ఫొటో లేకుండానే ఏజెంట్లకు లోపలికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రిసైడింగ్ అధికారులకు ప్రశ్నించారు. ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రాథమిక వైద్య శిబిరాన్ని సందర్శించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో మహ్మద్ అతారుద్దీన్ ఉన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...