పోలింగ్‌కు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు


Sat,May 11, 2019 01:12 AM

- కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు
నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: బోధన్ డివిజన్‌లో శుక్రవారం జరిగిన రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు తెలిపారు. శుక్రవారం ఆయన బోధన్ డివిజన్‌లో పలు పోలింగ్ కేంద్రాలలో పర్యటించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్, రెంజల్ మండలం సాటాపూర్, నీలా, బోధన్ మండలం సాలూర, కోటగిరి మండలం కేంద్రం, వర్ని, ఎడపల్లి మండల కేంద్రాల్లో ఆయన పర్యటించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా అవసరమైన చోట రిటర్నింగ్ అధికారులకు, ఎంపీడీవోలకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది, అధికారులు గుర్తింపు కార్డులు పెట్టుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోధన్ డివిజన్‌లోని ఎనిమిది జడ్పీటీసీ, 75 ఎంపీటీసీల స్థానాలకు కలిపి మొత్తం 412 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. సుమారు మూడు వేల సిబ్బంది విధులు నిర్వహించారని, రెండు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. పోలింగ్ కేంద్రాలోల సిబ్బందికి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశామని, ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో కనీస సదుపాయాలైన టెంట్లు, చల్లని తాగునీరు, దివ్యాంగులైన ఓటర్లకు వీల్‌చైర్స్, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఎన్నికలబ సందర్భంఆ జరిగిన సంఘటనలను దృష్టితో పెట్టుకొని అటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా పోలీస్ బందోబస్తుతో పాటు లైవ్ వెబ్‌కాస్టింగ్, కొన్ని చోట్ల వీడియో రికార్డింగ్ ఏర్పాటచేశామన్నారు. డివిజన్‌లో పోలింగ్ పర్యవేక్షణకు మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు.. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. ఎన్నికలు నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన అధికారులు, ఉద్యోగులు, ఓటర్లు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...