ముగిసిన తొలివిడత నామినేషన్ల పర్వం


Thu,April 25, 2019 03:03 AM

ఇందూరు : తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం సాయం త్రం ముగిసింది. చివరి రోజు జడ్పీటీసీ నామినేషన్లకు అభ్యర్థులు పెద్ద ఎత్తున దాఖలు చేశా రు. 35 మంది అభ్యర్థులు 52 నామినేషన్లను దాఖలు చేశారు. ఈ మూడ్రోజుల్లో మొత్తం 60 నామినేషన్లు జడ్పీటీసీ స్థానాలకు దాఖలయ్యాయి. చివరి రో జు నిజామాబాద్ జడ్పీటీసీ స్థానానికి ఐదుగురు అభ్యర్థులు ఐదు సెట్లను నామినేషన్ దాఖ లు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 7 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో బీజేపీ నుంచి 3 నామినేషన్లు, కాంగ్రెస్ నుంచి 2, టీఆర్‌ఎస్ నుంచి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ధర్పల్లి జడ్పీటీసీ స్థానానికి చివరి రోజు 8 మంది అభ్యర్థులు 14 నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు ఈ స్థానానికి మొత్తం 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో బీజేపీ నుంచి 6, కాంగ్రెస్ నుంచి 4, టీఆర్‌ఎస్ నుంచి 3, స్వతంత్రులు నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. డిచ్‌పల్లి జడ్పీటీసీ స్థానానికి చివరి రోజు ఆరుగురు అభ్యర్థులు పది నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు ఈ స్థానానికి మొత్తం 4 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఇందులో బీజేపీ నుంచి 1, కాంగ్రెస్ నుంచి 1, టీఆర్‌ఎస్ నుంచి 2నామినేషన్లు దాఖలు చేశారు. ఇందల్వాయి జడ్పీటీసీ స్థానానికి చివరి రోజు ఆరుగురు పది నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు ఈ స్థానానికి మొత్తం 11 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో బీజేపీ నుంచి 3, కాంగ్రెస్ నుంచి 1, టీఆర్‌ఎస్ నుంచి 3, స్వతంత్ర అభ్యర్థులు నలుగురు నామినేషన్లు వేశారు. మాక్లూర్ జడ్పీటీసీ స్థానానికి చివరి రోజు ముగ్గురు అ భ్యర్థులు 4 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ స్థానానికి మొత్తం 5 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో బీజేపీ నుంచి 1, కాంగ్రెస్ నుంచి 2, టీఆర్‌ఎస్ నుంచి 2 నామినేషన్లు దాఖలు చేశారు. మోపాల్ జడ్పీటీసీ స్థానానికి చివరి రోజు ఇద్దరు అభ్యర్థులు 4 నామినేషన్ సెట్లను దాఖలు చేశారు. ఇప్పటి వరకు ఈ స్థానానికి 4 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో రెండు కాంగ్రెస్, రెండు టీఆర్‌ఎస్ నామినేషన్లు దాఖలయ్యాయి. సిరికొండ జడ్పీటీసీ స్థానానికి చివరి రోజు నలుగురు అభ్యర్థులు 5 నామినేషన్లను దాఖలు చేయగా.. మొత్తం 5 నామినేషన్లు ఈ స్థానానికి వచ్చాయి. ఇందులో బీజే పీ 1, కాంగ్రెస్ 1, టీఆర్‌ఎస్ 3 నామినేషన్లు దాఖలు చేశారు. నవీపేట్ జడ్పీటీసీ స్థానానికి చివరి రోజుల నలుగురు అభ్యర్థులు 7 నామినేషన్ సెట్లను దాఖలు చే యగా.. మొత్తం ఈ స్థానానికి 7 నామినేషన్లు దాఖలు కాగా, ఇందులో బీజేపీ 1, కాంగ్రెస్ 2, టీఆర్‌ఎస్ 4 నామినేషన్లు వ చ్చాయి. మొత్తం నిజామాబాద్ రెవెన్యూ డివిజనల్ పరిధిలోని ఎనిమిది మండలాల్లో జరిగే తొలివిడత స్థానిక సంస్థల ఎన్నికలకు 60 నామినేషన్లు దాఖలయ్యాయి.

చివరి రోజు జడ్పీటీసీ స్థానాలకు జోరుగా నామినేషన్లు...
జడ్పీటీసీ నామినేషన్ల పర్వం బుధవారం సాయంత్రం ముగిసిం ది. డిచ్‌పల్లి జడ్పీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి, ప్రస్తుత ఎం పీపీ దాసరి ఇందిరా నామినేషన్ దాఖలు చేశారు. ఇందల్వాయి జడ్పీటీసీ సభ్యురాలిగా టీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, ప్రస్తుత జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ గడ్డం సుమనారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత జడ్పీటీసీ సభ్యురాలు కూరపాటి అరుణ, బీజేపీ అభ్యర్థి నాతి సౌమ్య నామినేషన్లు దాఖలు చేశారు. డిచ్‌పల్లి మండలానికి సంబంధిం చి కేవలం మూడు నామినేషన్లే దాఖలయ్యాయి. నిజామాబాద్ రూరల్ మండలం నుంచి జడ్పీటీసీ స్థానానికి ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్‌ఎస్ పార్టీ తరపున గొల్లెంక సుమలత, కాంగ్రెస్ పార్టీ తరపున ఇద్దరు అభ్యర్థులు బొల్లం రుచిత, ఎడ్ల రమాదేవి, బీజేపీ తరపున ఇద్దరు అభ్యర్థులు సరసాని విజయ, మూత మీనా నామినేషన్లు దాఖలు చేశారు. సిరికొండ మండ లం నుంచి జడ్పీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ పార్టీ తరపున మాలవత్ మాన్‌సింగ్, కాంగ్రెస్ పార్టీ నుంచి సంతోష్, మాలావత్ ఇండిపెండెంట్‌గా, బీజేపీ నుంచి మాలావత్ దేశియా, టీఆర్‌ఎ స్ పార్టీ నుంచి మాలావత్ రమేశ్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ధర్పల్లి మండలం నుంచి జడ్పీటీసీకి టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి జగన్, బీజేపీ నుంచి జొన్నలగడ్డ రవి, కాంగ్రెస్ నుంచి ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఇందల్వాయి మండలం నుంచి జడ్పీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ పార్టీ నుంచి గడ్డం సుమానారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి గాయ త్రి, బీజేపీ నుంచి నాయుడి విజయ నామినేషన్ దాఖలు చేశా రు. మోపాల్ మండలం అమ్రాబాద్ గ్రామ పంచాయతీ నుంచి టీఆర్‌ఎస్ పార్టీ తరపున కమలాబాయి, కాంగ్రెస్ పార్టీ తరపున దివ్యభారతి నామినేషన్ దాఖలు చేశారు. మాక్లూర్ మండలం నుంచి జడ్పీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ పార్టీ నుంచి దాదన్నగారి విఠల్‌రావు, కాంగ్రెస్ నుంచి బాలపూరం దయాకర్‌రావు, బీజేపీ నుంచి రవీందర్ నాయక్ నామినేషన్లు దాఖలు చేశారు. నవీపే ట్ మండలం నుంచి జడ్పీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బేగరి నాగమణి, నీరడి సవిత, కాంగ్రెస్ పార్టీ నుంచి సౌజన్య నామినేషన్ దాఖలు చేశారు. తొలి విడత ఎన్నికల జరిగే స్థానాలకు సం బంధించి 25న నామినేషన్ల పరిశీలన, 28న నామినేషన్ల ఉపసంహరణ అవకాశం ఉంది. మే 6న ఉదయం 7 గంటల నుంచి సా యంత్రం 5గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్నది.

వంద ఎంపీటీసీ స్థానాలకు 515 నామినేషన్లు...
తొలి విడత జరిగే ఎనిమిది మండలాల పరిధిలోని వంద ఎంపీటీసీ స్థానాలకు గాను 515 నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్ మండలంలో 8 ఎంపీటీసీ స్థానాలకు 34 నామినేషన్లు దాఖలు అందులో బీజేపీ 8, కాంగ్రెస్ 4, టీఆర్‌ఎస్ 13, స్వతంత్రుల నుంచి 9 నామినేషన్లు వచ్చాయి. ధర్పల్లి మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాలకు 59 నామినేషన్లు దాఖలయ్యాయి. అం దులో బీజేపీ 13, కాంగ్రెస్ 12, టీఆర్‌ఎస్ 23, స్వతంత్రులు 11 నామినేషన్లు వచ్చాయి. డిచ్‌పల్లి మండలంలో 17 ఎంపీటీ సీ స్థానాలకు 72 నామినేషన్లు దాఖలు కాగా.. అందులో బీజేపీ 11, కాంగ్రెస్ 14, టీఆర్‌ఎస్ 26, స్వతంత్రులు 21 నామినేష న్లు వచ్చాయి. ఇందల్వాయి మండలంలోని 11 ఎంపీటీసీ స్థా నాలకు గాను మొత్తం 81 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇం దులో బీజేపీ 18, కాంగ్రెస్ 11, టీఆర్‌ఎస్ 24, స్వతంత్రులు 28 నామినేషన్లు దాఖలయ్యాయి. మాక్లూర్ మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు 55 నామినేషన్లు దాఖలు కాగా అందులో బీజేపీ 14, కాంగ్రెస్ 13, టీఆర్‌ఎస్ 21, స్వతంత్రుల నుంచి 7 నామినేషన్లు వచ్చాయి. మోపాల్ 11 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 71 నామినేషన్లు దాఖలు కాగా.. అందులో బీజేపీ 11, కాంగ్రెస్ 16, టీఆర్‌ఎస్ 29, స్వతంత్రులు 15 నామినేషన్లు వ చ్చాయి. సిరికొండ 12 ఎంపీటీసీ స్థానాలకు గాను మొత్తం 52 నామినేషన్లు దాఖలు కాగా.. అందులో బీజేపీ 10, కాంగ్రెస్ 10, టీఆర్‌ఎస్ 14, స్వతంత్రులు 18 నామినేషన్లు వచ్చాయి. నవీపేట్ మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు గాను మొత్తం 91 నామినేషన్లు వచ్చాయి. ఇందులో పార్టీల వారీగా చూసుకుంటే అందులో బీజేపీ 20, కాంగ్రెస్ 16, టీఆర్‌ఎస్ 41, స్వతంత్రులు 12 నామినేషన్లు దాఖలు చేశారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...