నీడ లేదు.. నీళ్లు లేవు..!


Thu,April 25, 2019 03:02 AM

కోటగిరి : మహాత్మాగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలు పని ప్రదేశాల్లో ఎం డ తీవ్రతతో అలసటకు గురవుతున్నారు. వాస్తవానికి నీడ కోసం ప్రభుత్వం టెంటు సౌకర్యం కల్పించినప్పటి కీ.. స్థానిక మేట్ల నిర్లక్ష్యంతో టెంట్లు ఇంట్లోనే మూలుగుతున్నాయి. జిల్లా లో 2,57,986 కుటుంబాలకు జాబ్ కార్డులు ఉన్నాయి. పని కావాలని జిల్లాలో 2,73,915 మంది కూలీలు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం 88,624 మంది కూలీలు పనులు చేస్తున్నారు. ఉపాధి హామీ పని ప్రదేశాల్లో టెంట్లు తీసుకురావడం లేదని ఉపాధి హామీ కూలీలు వాపోతున్నారు. కోటగిరి మండలంలోని జల్లాపల్లి పాత గ్రామంలో సమీపంలో చెరువులో కూలీలు మండుటెండలోనే పనులు చేస్తున్నారు. చెరువులో పూడికతీత పనులు ఎండలోనే ఇలా శ్రమిస్తున్నారు. ముఖానికి రుమాళ్లు కట్టుకుని, దస్తీలు చుట్టుకుని.. భా నుడి తాపం నుంచి కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నా రు. తాగునీటి వసతి కల్పించక పోవడంతో కూలీలు ఇంటి నుంచి బాటిళ్లలో నీరు తెచ్చుకుంటున్నారు. వెంట బాటిళ్లలో తెచ్చుకున్న జలం కూడా వేడెక్కి తాగలేకపోతున్నామని కూలీలు వాపోతున్నారు. కొందరు వడదెబ్బకు గురవుతున్నారని అంటున్నారు. అధికారులు మాత్రం పనులు చేసే ప్రదేశాల్లో సౌకర్యా లు కల్పిస్త్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధ్దంగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలి..
ఉపాధి హామీ పనుల జరిగే చోట నీడ సౌకర్యం లేక ఇబ్బం ది పడుతున్నాం. ఎండలోనే కూర్చుని అన్నం తింటున్నాం. నీడ సౌకర్యం ఉంటే కొంతసేపు పని చేసి, మరికొంత సేపు సేద తీరే అవకాశం ఉండేది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపాధి హామీ పనుల జరిగే చోట నీడ, తాగునీటి సౌకర్యం కల్పించాలి.
- రమావత్ సాలీబాయి, ఉపాధి హామీ కూలీ, జల్లాపల్లి

ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందులు లేవు..
ఎండాకాలంలో ఉపాధి హామీ పనుల వద్ద ఏ సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నాం. వడదెబ్బకు గురికాకుండా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం లేదు. పనిచేస్తూ దెబ్బలు తగిలితే వేయడానికి మందులు, మెడికల్ కిట్లు కూడా అందుబాటులో లేవు. అధికారులు స్పందించి పనుల జరిగే చోట ఈ సౌకర్యాలు కల్పించాలి.
- పుష్ప, ఉపాధి హామీ కూలీ, జల్లాపల్లి

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...