భౌ.. బోయ్!


Thu,April 25, 2019 03:02 AM

నిజామాబాద్ క్రైం : జిల్లాలో కొన్ని రోజులుగా ఊర కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రెచ్చిపోయిన శునకాలు రోడ్లపై వెళ్తున్న వారిపైన ఎగబడి దాడులు చేస్తున్నాయి. ఈనెల 6న జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో వీధి కుక్కలు స్వైర విహారం చేసి స్థానికులపై విచక్షణ రహితంగా దాడిచేసి గాయపరిచాయి. ఈ సంఘటన మరవక ముందే మళ్ల్లీ మంగళవా రం కోటగిరి మండల పరిధిలోని హంగర్గాఫారం గ్రామంలో మరోసారి ఊర కుక్కలు స్థానికులపై దాడులు చేయగా.. ఈ ఘటనలో చుట్టుపక్కల వారు గాయపడి దవాఖానల పాలయ్యారు. పదిహేడు రోజుల వ్యవధిలో జరిగిన రెండు సంఘటనల్లో చిన్న పిల్లలు, పెద్దవారు, మహిళలు 41 మందికి పైగా తీవ్రగాయాలతో దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇం త జరుగుతున్నా సంబంధిత మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారులు తమకేమీ పట్ట్టన్నట్లుగా వ్యవహరిస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నగర శివారులోని నాగారం 80 క్వార్టర్స్ వెనకాల చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. నగరంలోని అన్ని ప్రాంతాలు, కాలనీల నుంచి సేకరించిన చెత్తను మున్సిపల్ సిబ్బంది వా హనాల్లో ఈ డంపింగ్ యార్డుకు తరలించి ఇక్కడ కుప్పలు కుప్పలుగా వేస్తారు. ఈ చెత్తలో వ్యర్థ పదార్థాలు, పాడైన తినుపదార్థ్థాలు ఉంటాయి. చాలా కాలంగా డంపింగ్ యార్డు ఉండడంతో అక్కడ తినడానికి ఆహారం దొరుకుతుందని గ్రహించిన శునకాలు నిత్యం యార్డు వద్దకు చేరుకుంటాయి.

ఈనెల 6న శుక్రవారం కూడా వీధి కుక్కలు డంపింగ్ యార్డు వద్ద ఒక్కసారిగా రెచ్చిపోయి జనంపై దాడిచేసి గాయపరిచాయి. యార్డు వద్ద నుంచి పక్కనే నివాస గృహాలు ఉన్న కాలనీ వరకు గుంపులు,గుంపులుగా పరుగులు పెడుతూ వచ్చిన కుక్కలు.. వాటికి ఎదురుపడిన వారినల్లా కరిచేశా యి. ఈ శునకాల దాడిలో సుమారు 25 మంది వరకు చిన్నారులు, మహిళలు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంటి ముం దర ఆడుకుంటున్న చిన్నారులపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేయడంతో వారు ఆర్థనాదాలు పెట్టారు. రక్తస్ర్తావం అవుతున్న క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ దవాఖానకి తరలించారు. ఈ వీధి కుక్కల దాడిలో ఒక్కరికి చేతిపై, ఓ చిన్నారికి తల,మెడ భాగంలో మరో బాలుడికి కంటి వద్ద, ఓ మహిళకు ఎడమ చేతిపై శునకాలు కరవడంతో శరీరంపై లోతుగా గాయాలయ్యాయి. శునకాల దాడిలో గా యాలపాలైన వారికి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన సిబ్బం ది చికిత్స అందించారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వీధికుక్కలను పట్టించుకోకపోవడంతో అవి రోజు రోజుకు పె రిగిపోతున్నాయి. జనంపై దాడిచేసి గాయపరుస్తున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి వీధికుక్కల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రాణాంతకంగా మారిన ఊర కుక్కలు...
ఊర కుక్కల బెడదతో జనం భయాందోళన చెందుతున్నారు. రోజురోజుకు ఊర కుక్కల బెడద పెరుగుతుండడంతో.. ఎక్కడ ఎటువైపు నుంచి దాడిచేసి గాయపరుస్తాయోనని జనం భయపడుతున్నారు. గతంలో ఊర కుక్కలు జనంపై దాడులు చేసిన సంఘటనలు జరిగితే వెంటనే సంబంధిత మున్సిపల్, పంచాయతీ అధికారులు స్పందించి శునకాలపై చర్యలు తీసుకునేవారు. కొన్ని సందర్భాల్లో సంబంధిత శా ఖల సిబ్బంది ఊర కుక్కలను బంధించి గ్రామాలు, మండలాలు, పట్టణాలకు దూరంగా అటవీ ప్రాంతాల్లో వదిలి పెట్టేవారు.

మరికొన్ని సందర్భాల్లో పిచ్చి కుక్కలకు మందులు పెట్టి చంపిన దాఖలాలు సైతం లేకపోలేవు. ఈ మధ్య కాలం లో ఊర కుక్కల బెడద కారణంతో జనం రోడ్ల పైకి రావాలంటేనే జంకుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టన్నట్లుగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు మేల్కొని ఊర కుక్కల బెడద నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...