రూ. 125కే విద్యుత్ కనెక్షన్


Wed,April 24, 2019 02:35 AM

ఖలీల్‌వాడి: దీన్‌దయాళ్ గ్రామజ్యోతి యోజన (డీడీయూజీజేవై) పథకం కింద దారిద్య్రరేఖకు దిగువున ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు రూ. 125లకే కనెక్షన్ అందిస్తున్నామని ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుదర్శనం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 125కే కనెక్షన్‌తో పాటు ఎస్‌పీహెచ్ మీటర్, ఎస్‌ఎంసీ బోర్డు, డబుల్ పోల్ ఎంసీబీ, సర్వీసు వైరు, సర్వీసు వైరుకు సపోర్టు జీఎల్ వైరు, పీవీసీ పైపు, బెండ్లు, జీఎల్ ఎర్తింగ్ పైపు, వైరు, స్విచ్‌లు, సాకెట్లు కలిగిన ఎస్‌ఎంసీ బోర్డు, ఎల్‌ఈడీ బల్చు, కనెక్షన్ ఇవ్వడానికి కావాల్సిన వైరు అందిస్తున్నట్లు తెలిపారు. బీపీఎల్ వినియోగదారులు సామగ్రిని విద్యుత్ సిబ్బంది అమర్చుతున్నారో లేదో సరిచూసుకొని, ఏదైనా అమర్చని యెడల, మీటరు అమర్చడానికి వినియోగారుల వద్ద డబ్బులు అడిగితే వెంటనే సంబంధిత డివిజనల్ ఇంజినీర్, ఆపరేషన్ వారికి సమాచారం అందించాలని కోరారు.

ఇప్పటి వరకు డీడీయూజీజేవై పథకం ద్వారా 12,589 దరఖాస్తులు వచ్చాయని, వీటి నుంచి 10,321 మీటర్లు బిగించామని తెలిపారు. మిగతావి ఈ నెలాఖరులోగా బిగిస్తామని పేర్కొన్నారు. ఇతర సమస్యలున్నా, లూజుగా ఉన్న ఎల్‌టీ లైన్‌లో స్పేసర్లు అవసరమున్నా, మిడిల్ పోల్స్ అవసరమున్నా, పోల్స్ వంగిపోయి ఉన్నా, కొత్త ట్రాన్స్‌ఫార్మార్స్ అవసరమున్నా, ట్రాన్స్‌ఫార్మార్లకు ఫెన్సింగ్, ట్రాన్స్‌ఫార్మార్ల గద్దెలు తక్కువ, ఎక్కువ ఎత్తులో ఉన్నా, రహదారికి ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కుకు వెళ్లే లైన్లు తక్కువ ఎత్తులో ఉన్నా వాటిని కూడా సరిచేస్తామని తెలిపారు. వీటిని సరిచేయడానికి విద్యుత్‌శాఖ సిబ్బందికి ఎలాంటి డబ్బులు చెల్లించనవసరం లేదన్నారు. వినియోగదారులకు మరే ఇతర సమస్యలున్నా టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 0028, 1912, నిజామాబాద్ కంట్రోల్ రూం నంబర్ 9440811600, డివిజినల్ ఇంజినీర్ ఆపరేషన్ 9440811582, బోధన్ డివిజినల్ ఇంజినీర్ ఆపరేషన్ 7901093941, ఆర్మూర్ డివిజినల్ ఇంజినీర్ ఆపరేషన్ 9440811585 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. ఫిర్యాదు అందిన వెంటనే సమస్య పరిష్కారిస్తామని ఎస్‌ఈ పేర్కొన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...