రెంజల్‌లో గులాబీ జెండా ఎగుర వేయాలి


Wed,April 24, 2019 02:34 AM

రెంజల్ : వచ్చే నెలలో నిర్వహించే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అందరు సమష్టిగా శ్రమించి రెంజల్‌లో గులాబీ జెండాను ఎగుర వేయాలని టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు శేషుగారి భూమారెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవా రం మండలంలోని నీలా క్యాంప్‌లో టీఆర్‌ఎస్ మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయమై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గెలిచే అభ్యర్థులనే జ డ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అధిష్ఠా నం బరిలో నిలుపుతుందన్నారు. బరి లో నిలిచే ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలదేనని భూ మారెడ్డి అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీ సీ బరిలో ఉన్న అభ్యర్థులు దరఖాస్తు లు చేసుకున్న గెలిచే అవకాశం ఉన్న వారికే ఎమ్మెల్యే షకీల్ బీఫాం కేటాయిస్తారని, అందరూ కలిసి కట్టుగా పార్టీ గెలుపు కోసం శ్రమించి రెంజల్ ఎం పీపీ, జడ్పీటీసీ పీఠం సొంతం చేసుకోవాలని కో రారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలే టీఆర్‌ఎస్ విజయాన్ని వరిస్తుందని మండలాధ్యక్షుడు భూమారెడ్డి ధీమా వ్య క్తం చేశారు. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి గౌ రాజీ రాఘవేందర్, మైనార్టీ నాయకుడు రఫియొద్దీ న్, మాజీ సర్పంచ్ రఘు, లతిఫొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...