ఒక సమస్య పరిష్కారం.. మరొకటి సర్వేకు ఆదేశం


Wed,April 24, 2019 02:34 AM

మోర్తాడ్: నమస్తే తెలంగాణలో ఈనెల 21న ధర్మగంటలో ప్రచురించబడిన విన్నపాలు వినవలే అనే శీర్షికన పాలెం గ్రామానికి చెందిన రైతు బానాల మహిపాల్ భూసమస్య, 23న నమోదు కాని భూవివరాలు అనే శీర్షికన పాలెం గ్రామానికి చెందిన శెట్టి పెద్ద మల్లయ్య రైతుకు చెందిన భూసమస్య గురించి ప్రచురితమైన కథనాలకు మోర్తాడ్ తహసీల్దార్ వెంకట్రావ్ స్పందించారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బానోత్ మహిపాల్‌కు 1794-సి సర్వేనంబర్‌లో 34గుంటల భూమి ఉందని, ఈ భూమి ఇతరుల ఖాతాలోకి వెళ్లిందని, దాన్ని సరిచేసి ఎంఎస్ 1900070586 నంబర్‌పై ఆర్డీవో ఆమోదం కోసం పంపామని తహసీల్దార్ వెంకట్రావ్ తెలిపారు. ఆర్డీవో ఆమోదం కాగానే మహిపాల్ పాస్‌బుక్‌లోకి 1794-సీ సర్వేనంబర్‌లోని భూమిని చేరుస్తామని చెప్పారు. అదే విధంగా పాలెం గ్రామానికి చెందిన శెట్టి పెద్దమల్లయ్యకు చెందిన 30గుంటల కొనుగోలు చేసిన భూమికి సంబంధించి వెంటనే సర్వే నిర్వహించి సర్వే వివరాలు తెలియజేయాలని సర్వేయర్‌ను మంగళవారం తహసీల్దార్ ఆదేశించారు. సర్వేజరిపి రైతుకు సంబంధించిన భూ వివరాలు అందజేయాలని సూచించారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...