విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు


Mon,April 22, 2019 11:55 PM

నందిపేట్ : ప్రభుత్వ దవాఖాన సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం అన్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక దవాఖానను సోమవారం తనిఖీ చేశారు. వాంతులు అయ్యాయని చికిత్స కోసం లక్ష్మి అనే మహిళ దవాఖానకు వచ్చింది. ఆ సమయంలో దవాఖానలో ఎవరూ లేకపోవడంతో ఆమె ఎంపీడీవో నాగవర్ధన్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఎంపీడీవో డీఎంహెచ్‌వోకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన డీఎంహెచ్‌వో నందిపేట్ దవాఖానకు వచ్చారు. ఆ సమయంలో విధులు నిర్వహించాల్సిన స్టాఫ్ నర్స్ త్రివేణి విధులకు రాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు సక్రమంగా నిర్వర్తించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ స్టాఫ్‌నర్సుకు మెమో జారీ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం దవాఖానలో సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై అక్కడున్న రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. సోమవారం సంత కావడంతో రోగులు ఎక్కువ సంఖ్యలో దవాఖానకు వస్తారని, సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని సిబ్బందికి ఆదేశించారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...