చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం


Mon,April 22, 2019 11:55 PM

ఖలీల్‌వాడి : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్త్తోందని జిల్లా పౌర సరఫరాల అధికారి కృష్ణప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నిర్ధ్దేశించిన లక్ష్యం మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 294 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 291 ప్రారంభించామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. క్వింటాల్ ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 1,770, సాధారణ రకానికి రూ. 1,750 మద్దతు ధర రైతులకు చెల్లిస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలుకు కావాల్సిన గన్నీ సంచులు, నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అధికారుల నేతృత్వంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారని, పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 00333, వాట్సాప్ నంబరు 7330774444లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. రైతులు పంట పొలాల నుంచి ఒకేసారి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకు రాకుండా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా దశలా వారీగా తీసుకువచ్చేలా కేంద్రాల నిర్వాహకులు రైతుల్లో అవగాహన తీసుకురావాలన్నారు. మార్కెటింగ్ శాఖలో సమన్వయం చేసుకొని ఎక్కడైనా టార్ఫాలిన్ కొరత ఉంటే దానిని అధిగమించాలని, వచ్చే రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...