అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేద్దాం


Mon,April 22, 2019 11:54 PM

వర్ని: దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించిన మహానుబావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని శ్రీనగర్ గ్రామంలో అంబేద్కర్ 128వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ నమాట్లాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేయాలని సూచించారు.

ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి..
అనంతరం శ్రీనగర్ గ్రామంలో స్పీకర్ పర్యటించారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేసి జూన్ నాటికి అర్హులకు అందించేలా ప్రణాళి క సిద్ధం చేయాలని అధికారులకు ఆయన ఆదేశించా రు. అనంతరం తగిలేపల్లి గ్రామంలో చివరి దశలో ఉ న్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను స్పీకర్ పరిశీలించారు. గ్రామంలో ఇంకా ఎన్ని ఇండ్లు అవసరమవుతాయని స్థానిక సర్పంచ్ వెంకన్నను అడిగి తె లుసుకున్నారు. సొంత స్థలం ఉండి డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తే ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని తెలిపారు. స్పీకర్ వెంట టీఆర్‌ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి, జట్పీటీసీ గుత్ప విజయభాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారోజి గంగారం, టీఆర్‌ఎస్ వ ర్ని మండల అధ్యక్షుడు మేక వీర్రాజు, సొసైటీ చైర్మన్ గోవూర్ హన్మంత్ రెడ్డి, సర్పంచులు శ్రీనగర్ రాజు, క ర్లం సాయిరెడ్డి, నానిబాబు, నరేందర్ రెడ్డి, రఘు టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పోశెట్టి పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...