టీఆర్‌ఎస్‌లో పెద్ద ఎత్తున చేరికలు


Mon,April 22, 2019 11:54 PM

వర్ని: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం వర్ని జడ్పీటీసీ గుత్ప విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని గోవూర్ గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డితో పాటు ఉపసర్పంచ్ గంగాధర్, వార్డు మెంబర్లు, బీజేపీ శక్తి కేంద్రం ఇన్‌చార్జి మధుసూధన్ రెడ్డి, బీజేవైఎం మండల కన్వీనర్ నవీన్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి, కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ తాహెర్‌తో పాటు సుమారు 100మంది పోచారం సురేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి సురేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో గోవూర్ సొసైటీ చైర్మన్ హన్మంత్ రెడ్డి, టీఆర్‌ఎస్ వర్ని మండల అధ్యక్షుడు మేక వీర్రాజు, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ నారోజి గంగారం, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పిట్ల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...