పట్టా పాస్‌బుక్‌లో నమోదు కాని భూవివరాలు


Mon,April 22, 2019 11:54 PM

మోర్తాడ్ : 18 ఏండ్ల క్రితం కొనుగోలు చేసిన భూమి వివరాలు ఇప్పటి వరకు పాస్‌బుక్‌లోకి అధికారులు ఎక్కించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ రికార్డుల ప్రక్షాళనతోనైనా పనవుతుందనుకున్న ఆ రైతుకు నిరాశే ఎదురైంది. పాలెం గ్రామానికి చెందిన శెట్టి పెద్ద మల్లయ్య అనే రైతులు అదే గ్రామానికి చెందిన చిన్న హన్మాండ్లు వద్ద 594ఊ సర్వే నంబర్‌లో 30గుంటల భూమిని కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి కొనుగోలు చేసిన భూమి తన పాస్‌బుక్‌లోకి ఎక్కించాలని తిరుగుతూనే ఉన్నాడు. భూప్రక్షాళనలో కూడా దరఖాస్తు పెట్టుకున్నాడు. అయినా ఫలితం మాత్రం లేదు. భూ రికార్డుల ప్రక్షాళనలో దరఖాస్తు చేసుకున్నాక, అధికారులు ఇచ్చిన 1బీ నమూనాలో కూడా 594ఊ సర్వే నంబర్‌లో 30 గుంటల భూమి శెట్టి పెద్దమల్లయ్యకు ఉన్నట్లుగా అధికారులు ఇచ్చారు. కానీ, భూమి మాత్రం పాస్‌బుక్‌లోకి చేరలేదు. గ్రామంలోని వీఆర్‌ఏకు అడిగినంత ముట్టజెప్పినా పనికావడం లేదని వాపోతున్నాడు. భూమి గురించి అడగడానికి వెళ్లినప్పుడల్లా అక్కడ భూమి చూడాలి, కొలవాలి అనడం, త్వరలో పాస్‌బుక్‌లో ఎక్కిస్తామనడం లాంటి సమాధానాలు చెబుతున్నారని, బెదిరించినట్టుగా మాట్లాడుతున్నారని రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. 18ఏండ్లుగా 30గుంటల భూమి గురించి తిరిగి తిరిగి వేసారి పోయాడు రైతు పెద్దమల్లయ్య. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాను కొనుగోలు చేసిన భూమిని పాస్‌బుక్‌లోకి ఎంట్రీ చేసి రైతుబంధు వర్తింజేయాలని కోరుతున్నాడు.

భూమి నమోదు చేయడం లేదు..
కొత్త పాస్‌బుక్‌లు వస్తాయంటే వీఆర్‌ఏకు అడిగినంత డబ్బులు ఇచ్చినా, పైసా కూడా తక్కువ ఇయ్యలేదు. అయిన పని చేయడం లేదు. కొనుగోలు చేసిన భూమిని పాస్‌బుక్‌లోకి ఎంట్రీ చేయడం లేదు. ఈ భూమికి సంబంధించి రైతుబంధు సాయం కూడా రావడం లేదు. నా భూమి నా పాస్‌బుక్‌లో వచ్చేలా చూసి నాకు న్యాయం చేయాలి.
-పెద్ద మల్లయ్య, రైతు, పాలెం (మోర్తాడ్ మండలం)

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...