నామినేషన్లు షురూ..


Mon,April 22, 2019 11:54 PM

ఇందూరు: తొలి విడతలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సోమవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.నిజామాబాద్ రెవెన్యూ పరిధిలో 8 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. సోమవారం 5 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వంద ఎంపీటీసీ స్థానాలకు గాను తొలిరోజు 26 నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్ డివిజన్‌లో 8 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. నిజామాబాద్ రూరల్ మండలంలో జడ్పీటీసీ స్థానానికి ఒక నామినేషన్ దాఖలైంది. ధర్పల్లి మండలంలోని జడ్పీటీసీ స్థానానికి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. డిచ్‌పల్లి జడ్పీటీసీ స్థానానికి ఒక , మాక్లూర్ జడ్పీటీసీ స్థానానికి ఒక నామినేషన్ దాఖలయ్యాయి. ఇందల్వాయి, మోపాల్, సిరికొండ, నవీపేట్ మండలాలకు తొలిరోజు నామినేషన్లు దాఖలు కాలేదు. నిజామాబాద్ రూరల్ మండలంలో బీజేపీ, ధర్పల్లి కాంగ్రెస్, డిచ్‌పల్లి టీఆర్‌ఎస్, మాక్లూర్ కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నిజామాబాద్ రూరల్ మండలంలో 8 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఒక్క నామినేషన్ దాఖలైంది. ధర్పల్లి మండలంలో 2 జడ్పీటీసీ స్థానాలు ఉండగా..

11 ఎంపీటీసీ స్థానాలుండగా 4 నామినేషన్లు, డిచ్‌పల్లిలో 17 ఎంపీటీసీ స్థానాలకు 5 నామినేషన్లు, ఇందల్వాయిలో 11 ఎంపీటీసీ స్థానాలకు 2, మాక్లూర్‌లో 14 ఎంపీటీసీ స్థానాలకు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. మోపాల్ 11 ఎంపీటీసీ స్థానాలకు 5 నామినేషన్లు, సిరికొండ 12 ఎంపీటీసీ స్థానాలకు 4 నామినేషన్లు, నవీపేట్‌లో 16 ఎంపీటీసీ స్థానాలకు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్ రూరల్ మండలంలో ఇండిపెండెంట్, ధర్పల్లిలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. డిచ్‌పల్లిలో 17 ఎంపీటీసీ స్థానాలకు గాను నలుగురు టీఆర్‌ఎస్ అభ్యర్థులు, ఇండిపెండెంట్ నామినేషన్లు వేశారు. ఇందల్వాయిలో 11 ఎంపీటీసీ స్థానాలకు టీఆర్‌ఎస్ నుంచి ఒకరు, ఇండిపెండెంట్‌గా ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. మాక్లూర్‌లో 14 ఎంపీటీసీ స్థానాలకు కాంగ్రెస్ 1, ఒక టీఆర్‌ఎస్ అభ్యర్థులు నామినేషను వేశారు. మోపాల్‌లో 11 ఎంపీటీసీ స్థానాలకు 1 కాంగ్రెస్, టీఆర్‌ఎస్2, ఇండింపెండెంట్2 నామినేషన్లు దాఖలయ్యాయి. సిరికొండ మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు 2 కాంగ్రెస్, 2 టీఆర్‌ఎస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నవీపేట్ మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు కాంగ్రెస్ 1, టీఆర్‌ఎస్ 1, ఇండిపెండెంట్ 1 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొత్తం తొలిరోజు ఎంపీటీసీకి 26, జడ్పీటీసీకి 5 నామినేషన్లు దాఖలయ్యాయని జడ్పీ సీఈవో వేణు తెలిపారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...