అభ్యర్థి ఎంపిక గ్రామాల్లో జరగాలి


Mon,April 22, 2019 02:32 AM

మోపాల్ : అభ్యర్థుల ఎంపిక గ్రామాల్లోనే జరగాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీఆర్‌ఎస్‌లో ఆశవహుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. ముఖ్యమైన కార్యకర్తల్లో అభ్యర్థి ఎవరని ప్రకటించాల్సిన విషయంలో గందరగోళం నెలకొనడంతో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఎంపీటీసీకి సంబం ధించి తమతమ గ్రామాల్లోనే పార్టీ కార్యకర్తలు కలిసి సమావేశమై పోటీ చేసే అభ్యర్థిని ఒకరిని నిర్ణయించుకుని తన వద్దకు రావాలని బాజిరెడ్డి గోవర్ధన్ వివిధ గ్రామాల టీఆర్‌ఎస్ కార్యకర్తలకు సూచించారు. మోపాల్ మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాల్లోనూ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండడంతో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఎంపిక చేసి వచ్చిన అభ్యర్థికే పార్టీ అధిష్ఠానం నుంచి టికెట్ ఇప్పిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోవర్ధన్ టీఆర్‌ఎస్ పార్టీ కార్య కర్తలకు సూచించారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే నివాసంలో జరిగిన సమావేశంలో పార్టీ కార్యకర్తలతో ఆయన ఈ విషయం తెలుపడంతో పార్టీ కార్యకర్తలు తమతమ గ్రామాలకు వెనుదిరిగి వెళ్లిపోయారు. రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు ఎంపీటీసీ టికెట్లకై ఎమ్మెల్యే నివాసానికి భారీగా చేరుకోవడంతో ఎమ్మెల్యే వారిని వెనక్కి పంపించారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...