ఎన్నికల విధుల్లో పక్షపాతం చూపించొద్దు


Mon,April 22, 2019 02:32 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఎన్నికల విధుల్లో ఎలాంటి పక్షపాతం చూపించకూడదని కలెక్టర్ రామ్మోహన్‌రావు అన్నారు. నిజామాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో ఉన్న వా రు తప్పనిసరిగా సమయపాలనతో పాటు నియ మ నిబంధనలు పాటించాలని తెలిపారు. ఈనెల 22 నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుందన్నారు. నామినేషన్ల కోసం ఎక్కువగా వచ్చిన పక్షంలో 5 గంటలోపు వచ్చిన వారిని టోకెన్ ఇచ్చి నామినేషన్లు స్వీకరించాలని తెలిపారు. నామినేషన్ వేసిన పార్టీల అభ్యర్థుల బీ ఫామ్ ఈనెల 28 మధ్యాహ్నం 3 గంటల వరకు ఇవ్వాలన్నారు. అలాట్మెంట్ ఆఫ్ సింబల్ నేషనల్ పార్టీస్ రిజిస్టర్ అలాట్మెంట్ అయిన పార్టీలు, రిజిస్టర్ అయి సింబల్ అలాట్మెంట్ కాని పార్టీలు తర్వాత ఇండిపెండెంట్లకు తెలుగు వర్ణమాల ప్రకారం అలాట్మెంట్ చేయాలన్నారు. ఈ విధంగా నాలుగు కేటగిరీల్లో సింబల్ కేటాయింపు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...