నిత్యం దైవారాధన చేయాలి


Mon,April 22, 2019 02:31 AM

బోధన్, నమస్తే తెలంగాణ : ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తిని గౌరవించాలని, నిత్యం దైవారాధన చేయాలని ముఖేడ్‌కు చెందిన డాక్టర్ విరూపాక్ష శివాచార్య స్వామీజీ అన్నారు. బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వరాలయంలో వీరశైవ జంగమ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖండ శివనామ సప్తాహంలో భాగంగా ఆయన హాజరై భక్తులనుద్దేశించి మాట్లాడారు. నేటి సమాజంలో ప్రతి వ్యక్తి విలాసాలకు అలవాటు పడి, నేను అనే అహంతో కోపతాపాలను పెంచుకుంటున్నారని అన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మం మనల్ని రక్షిస్తుందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ముక్తిమార్గం సాధించేందుకు దైవారాధన చేయాలని అన్నారు. దానగుణం కలిగి ఉండాలన్నారు. ప్రతి వ్యక్తి ఆత్మ, పరమాత్మ గురించి తెలుసుకోవాలన్నారు. నిత్యం కొంత సమయాన్ని దైవనామ స్మరణ చేయాలని, దీంతో సుఖఃశాంతులు కలిగి ఉంటాయన్నారు. భగవంతుడు ఇచ్చిన మానవ జన్మ సార్థకతకు కృషి చేయాలని తెలిపారు. ఎదుటి వారిలో దైవత్వాన్ని సందిర్శించుకునే గుణం కలిగి ఉండాలన్నారు. దీంతో కోపతాపాలకు దూరమై, సుఖంగా ఉంటామని వివరించారు. ఈ సందర్భంగా పరమ రహస్య గ్రంథ పారాయణం కొనసాగించారు. కార్యక్రమంలో వీరశైవ సమాజ్ ప్రతినిధులు, భజన మండలి సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...