సాగు పద్ధతులు అనుసరణీయం


Mon,April 22, 2019 02:31 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : ఆర్మూర్ ప్రాంతంలోని రైతుల పంటల సాగు పద్ధతులు అనుసరణీయంగా ఉన్నాయని మహబూబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రశంసించారు. మండలంలోని అంకాపూర్ గ్రామాన్ని ఆదివారం సూర్యపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామానికి చెందిన 120 మంది రైతుల బృందాన్ని వెంట తీసుకొని ఎస్పీ కోటిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ గ్రామ రైతులను ఆర్మూర్ ప్రాంతంలో సాగు విధానాలను చూయించడానికి తీసుకువచ్చినట్లు చెప్పారు. అంకాపూర్ రైతులు పంటల సాగు పద్ధతులు అద్భుతంగా ఉన్నాయన్నారు. తక్కువ నీటి సదుపాయంతో డ్రిప్, నీటి నిల్వకుండీలతో ఆరుతడి పంటలను సాగు చేయడం బాగుందన్నారు. అంతకుముందు గ్రామంలోని గురడిరెడ్డి రైతు సంఘంలో కేకే భాజన్నతో సమావేశమై సాగు విధానాలను తెలుసుకున్నారు. అనంతరం రైతుల పంట క్షేత్రాలను సందర్శించి రైతులు సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎస్సై విజయ్‌నారాయణ్, కానిస్టేబుళ్లు మహేందర్, శ్రీను, శేఖర్, మాధవరం రైతులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...