ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి


Mon,April 22, 2019 02:31 AM

ఖలీల్‌వాడి : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రామ్మోహన్‌రావు అన్నారు. ఎంపీడీవో, ఆర్వో, ఈవోపీఆర్డీలతో వీడియో కాన్ఫరెన్సు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం నుంచి నిజామాబాద్ డివిజన్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. 24 తేదీ వరకు నామినేషన్ వేయవచ్చన్నారు. మే 6న పోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. మొదటి విడత నిజామాబాద్ డివిజన్‌లో 8 జడ్పీటీసీలకు, వంద ఎంపీటీసీలకు 22న ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్ వేయవచ్చన్నారు. నామినేషన్ ఆన్‌లైన్ ద్వారా కూడా వేయవచ్చునని, ఆన్‌లైన్ ద్వారా చేసిన వారు నామినేషన్ హార్డ్ కాపీతో పాటు డిక్లరేషన్ కూడా ఇవ్వాలని తెలిపారు. మొత్తం ఓటర్లు 2,60,467 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. 24న నామినేషన్ ఉపసంహరణ, 25న నామినేషన్ పరిశీలన, నామినేషన్ వివిధ ప్రాంతాల నుంచి వేసిన వారు విత్‌డ్రా తేదీ కంటే ముందే ఉపసంహరించుకోవాలని ఒక్క నామినేషన్ ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు.

అందరికీ తెలిసే విధంగా నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని, తహసీల్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయాలన్నారు. వచ్చిన నామినేషన్లను వెంటనే ఆన్‌లైన్ అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల సామగ్రికి, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. రెండో విడత 8 జడ్పీటీసీ, 75 ఎంపీటీసీ స్థానాలకు 2,00,203 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు. మూడో విడతకు 11 జడ్పీటీసీ, 124 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నామని వివరించారు. మూడో విడతలో 3,18,442 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని అన్నారు. వీటన్నింటికి ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 27 జడ్పీటీసీ, 299 ఎంపీటీసీలకు మొదట నిజామాబాద్ డివిజన్, డిచ్‌పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, ధర్పల్లి, నవీపేట్, నిజామాబాద్ రూరల్, సిరికొండ ఎన్నికలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వేణు, డిప్యూటీ సీఈవో గోవింద్, డీపీవో జయసుధ, జడ్పీ ఏవో కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...