అగ్ని ప్రమాదాలు అరికట్టాలి


Sun,April 21, 2019 12:28 AM

నిజామాబాద్ క్రైం: అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రతి రోజూ 24 గంటలు ప్రజా సేవలో ఉంటారని, ఎక్కడ ప్రమాదం సంభవించినా వెంటనే స్పందించి ప్రజల ఆస్తులతో పాటు ప్రాణాలు కూడా కాపాడుతారని, వారి సేవలు అభినందనీయమని కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ముందుగా ఆయన అగ్నిమాపక శాఖ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అగ్నిమాపక శాఖ సేవలను అందరూ గుర్తించడంతో పాటు అగ్నిప్రమాదాలు జరగకుండా నియంత్రించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరూ మన ఇంట్లోగానీ ఇతర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. నిత్యం మనం వాడే ఎలక్ట్రికల్ వస్తువులు నాణ్యమైనవి వాడడం ద్వారా అగ్ని ప్రమాదాలను అరికట్టడంతో మనవంతు బాధ్యత నిర్వహించిన వారం అవుతామని కలెక్టర్ అన్నారు. ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహిస్తారని, అందుకు కారణం 1944 ఏప్రిల్‌లో ముంబాయిలో జరిగిన ప్రమాదంలో మంటలు ఆర్పుతున్న సమయంలో ఫైర్ సిబ్బంది అసువులు బాశారని, వారిని స్మరిస్తూ వారోత్సవాలు నిర్వహిస్తున్నారని అన్నారు.

ప్రమాదాలు ఎక్కడైనా జరిగే ఆస్కారం ఉంది
అగ్నిప్రమాదాలు ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా జరుగుతుంటాయని తానా ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీశైలం అన్నారు. అలాంటివి జరగకుండా అరికట్టేందుకు అందరూ ప్రయత్నించాలని అన్నారు. కాడియోకు సంబంధించిన శిక్షణ కల్పిస్తున్నామని, ఇది అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని , ఈ శిక్షణకు అగ్నిమాపక సిబ్బందిని కూడా ఆహ్వానిస్తామని అన్నారు. ఒక్కోసారి చిన్న చిన్న తప్పిదాలతోనే అగ్నిప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయని డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌ఫోర్స్ కమిషనర్ డి.వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్‌ను జాగ్రతగా వాడకపోవడం, సెల్‌ఫోన్ చార్జర్, విద్యుత్ పరికరాలు నాసిరకమైనవి వాడడం వల్ల కూడా అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయన్నారు. ప్రమదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు.

90 శాతం విద్యుత్ సంబంధ ప్రమాదాలే
తరుచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాల్లో 90 శాతం ప్రమాదాలు విద్యుత్ వాడకంతో సంబంధం కల్గిన సంఘటనలు ఉంటున్నాయని జిల్లా అగ్నిమాపక అధికారి జి.మురళి మనోహర్ రెడ్డి అన్నారు. అందుకు ప్రధాన కారణం ఇంట్లో, ఫ్యాక్టరీలో, వ్యాపార సంస్థలో నాణ్యమైన ఐఎస్‌ఐ స్టాండెడ్ విద్యుత్ వైర్లు వాడకపోవడం కారణమని తేలిందన్నారు. ఎల్‌పీజీ గ్యాస్ పైపులు కూడా నాసిరకమైనవి వాడటం వల్ల కూడా అగ్నిప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయన్నారు. ప్రజలు నాణ్యమైన పరికరాలు వాడాలని అన్నారు.

శాలువాలతో సత్కారం
కార్యక్రమం ప్రారంభానికి ముందుగా కలెక్టర్ రాంమ్మోహన్ రావు, రావాణా శాఖ అధికారి, డాక్టర్ శ్రీశైలం, వ్యాపారవేత్త సోమానిలను అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అసిస్టెంట్ ఫైర్‌అధికారి భానుప్రతాప్, నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ జె.రంజిత్ కుమార్, కామారెడ్డి ఫైర్ ఆఫీసర్ పల్లె దత్తు, ఆర్మూర్ ఎన్.ప్రవీన్, బాన్సువాడ ఇన్‌చార్జి అధికారి ఎస్.ధర్మరాజు, ఎల్లారెడ్డి ఇన్‌చార్జి ఆర్.రాంచందర్, మద్నూర్ ఇన్‌చార్జి జి.కాంతారావు సిబ్బంది పాల్గొన్నారు.

ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా అగ్ని మాపక సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి జి.మురళి మనోహర్ రెడ్డి పర్యవేక్షణలో అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ భానుప్రతాప్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలోని హైదరాబాద్ రోడ్డులోని పూలాంగ్ చౌరస్తా వద్ద ఓ స్టార్ హోటల్‌లో ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలనే అంశాలపై అవగాహన కాల్పించారు. గ్యాస్ సిలిండర్ లీకేజీ అవుతున్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే అంశాలను వివరించారు. జాగ్రతలు పాటించలనే సూచలను తెలియజేస్తూ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. వాల్ పోస్టర్లను అంటించారు. కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...