బొలేరో వాహనం బోల్తా


Sun,April 21, 2019 12:28 AM

కోటగిరి : మండలంలోని కొల్లూర్ సమీపంలో రోడ్డుపై ఉన్న వరి ధాన్యం కుప్ప వద్ద పెట్టిన రాళ్లపైకి ఎక్కి అదుపుతప్పి బొలేరో వాహనం బోల్తా పడ్డ సంఘటన కొల్లూర్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని సంగీ గ్రామం నుంచి ఉదయం 7 గంటల సమయంలో గోధుమల బస్తాల లోడ్‌తో నిజామాబాద్ వెళ్లేందుకు కొల్లూర్ మీదుగా వెళ్తుండగా కొల్లూర్ గ్రామం దాటిన కొంత సేపటికి రోడ్డుపై ధాన్యం కుప్ప వద్ద ఉన్న రాళ్లపైకి ఎక్కి ఒక్క సారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే పొలంలోకి దూసుకుపోయి బోల్తా పడింది. వాహనంలో డ్రైవర్‌తో పాటు క్లీనర్ ఉండడంతో వారికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించామని వాహన యజమాని తెలిపారు. బొలేరో వాహనం బోల్తా పడడంతో వాహనంలో ఉన్న గోధుమలు నేలపాలైనట్లు తెలిపారు. బస్తాలను మరో డీసీఎం వాహనంలో ఎక్కించారు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదని బాధితులు తెలిపారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...