హనుమాన్ శోభాయాత్ర శాంతియుతంగా జరుపుకోవాలి


Fri,April 19, 2019 02:11 AM

నిజామాబాద్ క్రైం: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించే హనుమాన్ శోభాయాత్ర శాంతి యుతం గా జరుపుకోవాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయ ఒక ప్రకటనలో వెల్లడించారు. శోభాయాత్ర నిర్వహించే దారి పొడవున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో నిర్వహించే హనుమాన్ జయంతి శోభాయాత్ర, అన్నదాన కార్యక్రమాలు శాం తియుతంగా నిర్వహించాలని సూచించారు. మూడు డివిజన్‌ల పరిధిలో శోభాయాత్ర సందర్భంగా ఎ లాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. శోభాయాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు దారి పొడవునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని చోట్లా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుం డా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, అన్నిరకాల జాగ్రతలు పాటించాలని, యాత్ర నిర్వాహకులు, భక్తులు, యాత్రలో పాల్గొనే ప్రజలు నిబంధనల ప్రకారం నడుచుకుంటూ పోలీసులకు సహకరించాలని పేర్కొన్నారు. శోభాయాత్రలో డీజే ఏర్పాటుకు ఎలాం టి అనుమతి ఉండదని, శోభాయాత్రకు అందరూ సహకరించాలని సీపీ కార్తికేయ వెల్లడించారు. జనాలు ఎలాంటి పుకార్లు నమ్మకూడదని, ప్రతి ఒక్కరూ స్నేహ భావంగా ఉండాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ముగ్గురు ఏసీపీలు, 10 మంది ఇన్‌స్పెక్టర్లు, 35 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు 800 మంది, మహిళా కానిస్టేబుళ్లు 30 మంది, స్పెషల్ పార్టీ బలగాలు, ఇతర సిబ్బంది మొత్తం 900 మంది బందోబస్తులో పాల్గొంటారని వివరించారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...