బాధిత సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక సహాయం


Wed,April 17, 2019 01:48 AM

నిజామాబాద్ క్రైం : జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యం కారణంగా మృతి చెందిన సి బ్బంది కుటుంబాలకు తోటి సిబ్బంది పోగుచేసిన ఆర్థి క సహాయం(డెత్‌ఫండ్) చెక్కులను కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తీకేయ మంగళవారం అందజేశారు. ఎండీ నజీముద్దీన్ (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్- 1479) హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తూ 16 డిసెంబర్, 2018లో అనారోగ్యంతో మృ తి చెందాడు. ఆయన కుటుంబానికి కానిస్టేబుల్ నుంచి సీపీ వరకు ప్రతి ఒక్కరి సహాయంతో డెత్‌ఫండ్ రూ. లక్షా 33వేల 500 చెక్కును మృతిని భార్యకు సీపీ అందజేశారు. మొయినుద్దీన్(స్పెషల్ బ్రాంచ్ అటాచ్డ్ ఏఎస్సై) అనారోగ్యంతో 12 జనవరి, 2019న మృతి చెం దాడు. ఆయన కుటుంబానికి సిబ్బంది డెత్‌ఫండ్ రూ.లక్షా 31 వేల చెక్కును అందజేశారు. అదనపు డీసీపీ ఎమ్.శ్రీధర్ రెడ్డి, ఆర్‌ఐ నిరంజన్, పోలీస్ అసోసియోషన్ అధ్యక్షుడు షకీల్ పాషా పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...