ఈదురుగాలులకు నేలరాలిన మామిడి


Wed,April 17, 2019 01:48 AM

నిజామాబాద్ రూరల్ : ప్రకృతి కన్నెర్ర చేసిన కారణంగా సోమవారం రాత్రి బలమైన ఈదురుగాలు వీచడంతో మామిడి తోటల్లో ఉన్న మామిడి కాయలు నేలరాలాయి. చేతికి వచ్చిన మామిడి పంట నేలపాలు కావడంతో జిల్లావ్యాప్తంగా 240 మంది మామిడి తోటలు పెంపకం చేసిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో మొత్తం 1600 ఎకరాల్లో రైతులు మామిడి తోటల పెంపకం చేపట్టారు. ఈ నేపథ్యంలో వీచిన ఈదురుగాలులతో 375 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిళ్లినట్లు ఉద్యానశాఖ అధికారులు మంగళవారం ప్రాథమిక అంచనా వేసినట్లు డిప్యూ టీ డైరెక్టర్ నర్సింగ్‌దాస్ తెలిపారు. రాలిన మామి డి పంట నష్టం మొత్తం రూ. 42లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.

బోధన్ డివిజన్‌లో అత్యధికంగా 329 ఎకరాల్లో మామిడి పంట నష్టం వాటిల్లింది. బోధన్ మండలంలో 103 ఎకరాలు, ఎడపల్లి మండలంలో 28, రెంజ ల్ మండలంలో 37, కో టగిరి మండలంలో 50 ఎకరాలు, రుద్రూర్ మం డలంలో 41, నవీపేట్ మండలంలో 50 ఎకరాలు, సిరికొండలో 44, ముప్కాల్ మండలంలో ఒకటిన్న ర ఎకరాల్లో నష్టం వాటిల్లింది. మంగళవారం ఉద్యాన అధికారులు పండరి రిసిత, రోహిత్ తమ మండలాల పరిధిలో జరిగిన మామిడి పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టం అంచనా వేసి డీడీ కి నివేదిక సమర్పించారు. మొత్తం 375 ఎకరాల్లోన 33 శాతం పైబడి మామిడి పంట నష్టం జరిగిందని ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు డీడీ తెలిపారు. ఇదిలా ఉండగా.. చేతికి వచ్చిన పంటకు నష్టం వాటిల్లినందున తమకు పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు లు కోరుతున్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...