కాంగ్రెస్, బీజేపీల కుట్రలో పడొద్దు


Sun,March 24, 2019 12:31 AM

మోర్తాడ్: ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు రైతులను ఏమాత్రం పట్టించుకోలేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల కోసం అనేక పథకాలు, సంక్షేమ, కార్యక్రమాలను అమ లు చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మోర్తాడ్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతులకు ఉన్న రూ.11 కోట్ల ఎర్రజొన్న బకాయిలను చెల్లించిందన్నారు. గతేడాది క్వింటాలుకు రూ.2300 మ ద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ ఎన్నికలను అడ్డుకునే కుట్రలో భాగంగా రైతులను రెచ్చగొడుతున్నాయని, రైతులు వారి కుట్రలో పడొద్దని మం త్రి విజ్ఞప్తి చేశారు. ఎర్రజొన్నల రైతులను ఆదుకుంది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం వెల్లడించారని, ఎర్రజొన్న రైతులకు న్యాయం జరిగే లా చూస్తానని సీఎం వాగ్ధానం చేశారని, ఎర్రజొన్నలకు పూర్తి న్యాయం జరిగే విధంగా తాను చూ స్తానని, ఆబాధ్యత తానే స్వయంగా తీసుకుంటానని మంత్రి చెప్పారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలచిందని, అదే విధంగా రైతుబీ మా పథకాన్ని ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలచిందని చెప్పారు. ఎస్సారెస్పీలో నీళ్లునింపి రైతులకు సాగునీటిని అందించేందుకు పునరుజ్జీవ పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని, కాళేశ్వరం ప్యాకేజీ 21 పనులు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్నిరకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి రైతులు సహకారంగా ఉండాలని కోరారు.

ప్రభు త్వం ఈసారి కూడా ఎర్రజొన్న రైతులకు సముచిత న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. ఎంపీ ఎన్నికలు కాగానే ఎర్రజొన్న రైతులకు సహాయం అందుతుందని, రైతులు ఈవిషయాన్ని గుర్తించాలని కోరారు. పసుపునకు మద్ధతు ధర అంశం కేంద్రం పరిధిలోనిదని అన్నారు. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ప్రభుత్వమే పసుపును కొనుగోలు చేసి రైతులకు మేలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని మంత్రి అ న్నారు. కొనుగోలు చేసిన పసుపును పొడి చేసి విక్రయించే విధంగా ప్రక్రియ కొనసాగుతుందని, అందుకు కొంత సమయం పండుతుందని చెప్పా రు. ఇక పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని చాలాసార్లు ఎంపీ కవిత పార్లమెంట్‌లో గళమెత్తి పోరాటం చేసినా.. బీజేపీ ప్రభుత్వం స్పందించలేదని, పసుపుబోర్డు విషయంలో బీజేపీ ప్రభు త్వం తెలంగాణకు న్యాయం చేయలేకపోయిందన్నారు. ఎంపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించుకుంటే ఎంపీకవిత, సీఎం కేసీఆర్ పసుపుబోర్డు తీసుకువస్తారని అన్నారు. రైతులకు సీఎం అన్నివిధాలుగా అండగా ఉంటున్నారని, సీఎం కేసీఆర్ మనసును బాధపెట్టే విధంగా వ్యవహరించవద్దని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. రైతులతో నామినేషన్లు వేయించాలన్న కుట్రను గుర్తించి ఇకముందు నామినేషన్లు వేయకుండా, వేసిన వారు నామినేషన్లను ఉపసంహరించుకోవాలని రైతులను ఆయన కోరారు. అంతకు ముందు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి రైతులతో సమావేశమయ్యారు.

టీఆర్‌ఎస్‌తోనే ఎర్రజొన్న రైతులకు న్యాయం
గతంలో ఎర్రజొన్న రైతులను ఎవరూ పట్టించుకోలేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమే పట్టించుకుందని, ఎర్రజొన్న రైతులకు న్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ అని మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి అన్నారు. ఎర్రజొన్న బకాయిలను చెల్లించింది, గతేడాది మద్దతు ధరను ప్రకటించింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్న విషయాన్ని రైతులు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. నిజామాబాద్ సభలో దేశప్రజల సాక్షిగా ఎర్రజొన్న రైతులకు న్యాయం చేస్తానన్న సీఎం వాగ్ధానాన్ని గౌరవించి, దేశంలోనే ఉత్తమ సీఎంగా ఉన్న మన సీఎం కేసీఆర్ గౌరవాన్ని పెంచే విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు పార్లమెంట్‌లో ఎవరూ పసుపు బోర్డు గురించి కొట్లాడలేదన్నారు. కానీ, మన ఎంపీ కవిత పసుపుబోర్డు గురించి ఎన్నోసార్లు పార్లమెంట్‌లో ప్రశ్నించారన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇది ఎన్నికల సమయమని, ఇప్పుడు రైతులను ఉసిగొలుపుతున్న వారు.. రైతులను వాడుకుని ఎన్నికల తర్వాత ముఖం చాటేస్తారని, ఆ నగ్న సత్యాన్ని రైతులు గ్రహించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న కుట్రలో పడొద్దని రైతులకు ఆయన సూచించారు.

కుట్రను గుర్తించి నామినేషన్లు వేయకుండా, వేసిన వారు ఉపసంహరించుకొని సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పర్సదేవన్న, బీసీ సెల్ మండల కన్వీనర్ తొగటి శ్రీనివాస్, ఎంపీటీసీ మురళీగౌడ్, నాయకులు చిన్నారెడ్డి, శివలింగు శ్రీనివాస్, గడ్డం లింగారెడ్డి, గంధం మహిపాల్, రంజిత్, మోహన్‌రెడ్డి, దడివె నవీన్, ఆరీఫ్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...