చైన్ స్నాచర్ల అన్వేషణకు ప్రత్యేక టీం


Sun,March 24, 2019 12:30 AM

నిజామాబాద్ క్రైం: జిల్లా కేంద్రంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నగరంలోని కోటగల్లి ప్రాంతంలో శుక్రవారం ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఓ మహిళ మెడలోంచి మూడు తులాల బంగారు గొలుసు తెంచుకొని పరారయ్యారు. అయితే స్నాచింగ్‌కు పాల్పడిన దుండగులు (ఎఫ్‌జెడ్) నలుపు రంగు బైక్‌పై వచ్చినట్లుగా బాధితురాలితో పాటు స్థానికులు పోలీసులకు వివరించారు. అంతే కాకుండా దుండగులు పరిపోతుండగా నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు అమర్చిన సీసీ కెమెరాలకు సైతం చిక్కారు. చాలా రోజుల అనంతరం జిల్లా కేంద్రంలో మళ్లీ చైన్‌స్నాచింగ్ సంఘటన చోటు చేసుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. నిందితులను పట్టుకునేందుకు ఏసీపీ శ్రీనివాస్ కుమార్ పర్యవేక్షణలో నగర సీఐ జి.నరేశ్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. అయితే దుండగుల ఆనవాళ్లు గుర్తు పట్టేందుకు పోలీసులు సీపీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. రెండు రోజులుగా ఈ చర్యల కొనసాగుతోంది. శనివారం సైతం పోలీసులు స్థానిక న్యాల్‌కల్ రోడ్డు చౌరస్తా వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌లోని సీసీ పుటేజీలను పరిశీలించారు. గొలుసు దొంగలు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుండగులు స్నాచింగ్ సమయంలో వినియోగించిన బైక్‌కు నంబర్ కూడా లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుల అన్వేషణ కోసం దర్యాప్తు బృందాన్ని మహారాష్ట్రకు సైతం పంపించనున్నారు.

వాహనాల షో రూంలో విచారణ
గొలుసు దొంగలు బజాజ్ కంపెనీకి చెందిన నలుపు రంగు ఎఫ్‌జెడ్ బైక్‌పై వచ్చారు. ఈ బైక్‌లు ఇటీవల కాలంలో ఏ ప్రాంతానికి ఎన్ని విక్రయించారనే పూర్తి స్థాయి సమాచారం తీసుకునేందుకు పోలీసులు సంబంధిత బజాజ్ షో రూంలో సైతం ఆరా తీస్తున్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...