పోలింగ్ ప్రశాంతం


Sat,March 23, 2019 01:43 AM

- ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 84.24 శాతం..
- పట్టభద్రుల స్థానానికి 60.08 శాతం ఓటింగ్ నమోదు
- కరీంనగర్‌కు చేరిన బ్యాలెట్ బాక్సులు
- 28 ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి

ఇందూరు: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో మొత్తం ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 3,078 మంది ఓటర్లు ఉండగా.. 84.24 శాతం ఓటింగ్ నమోదైంది. పట్టభద్రులకు 24,173 మంది ఓటర్లు ఉండగా.. 60.08 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 8గంటల నుంచే పోలింగ్ స్టేషన్లలో పట్టభద్రులు , ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ మైదానంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. ఈ నెల 26న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 3,078 మంది ఓటర్లు ఉండగా.. 84.24 శాతం ఓటింగ్ నమోదైంది. పట్టభద్రులకు 24,173 మంది ఓటర్లు ఉండగా.. 60.08 శాతం ఓటింగ్ నమోదైంది. నిజామాబాద్ డివిజన్‌లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు 77.16 శాతం, పట్టభద్రులకు 50.91శాతం పోలింగ్ నమోదైంది. బోధన్ డివిజన్‌లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు 87.74, పట్టభద్రులకు 65.75శాతం పోలింగ్ నమోదైంది. ఆర్మూర్ డివిజన్‌లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు 87.82శాతం పోలింగ్ నమోదు కాగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీలకు 63.58శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 8గంటల నుంచే పోలింగ్ స్టేషన్లలో పట్టభద్రులు , ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. నిజామాబాద్ నగరంలోని పోలింగ్ స్టేషన్‌ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఆయా పోలింగ్ స్టేషన్‌ల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ మైదానంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఈనెల 26న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...