వెల్లువెత్తినఅభిమానం


Sat,March 23, 2019 01:41 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఇందూ రు ప్రజలు ఐక్యత చాటుకుంటున్నారు. తమ చైతన్యానికి ప్రతీకగా అభిమాన నాయకురాలు కల్వకుంట్ల కవితకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. పార్లమెంట్ స్థానానికి మరోసారి బరిలో దిగిన కవితకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. ఎన్నికల ఖర్చుల కోసం స్వయంగా పైసా పైసా పొగేసి ఆమెకు విరాళాల రూ పంలో అందజేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. గతంలో పదహారు సార్లు లోక్‌సభకు ఎన్నిక లు జరిగాయి. పోటీ చేసే అభ్యర్థికి ఈ విధంగా వెల్లువలా మద్దతు ఎన్నడూ లభించలేదు. జిల్లా చరిత్రలో ఇదో నూతన అధ్యాయంగా నిలుస్తున్నది. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సబ్బండవర్ణాలు ఆమెకు జై కొడుతున్నారు. కుల సంఘాలన్నీ విరాళాలు అందజేస్తూ ఎన్నికల ఖ ర్చులకు తమ వంతుగా ఉడతాభక్తిగా సాయాన్ని అం దజేస్తున్నాయి. ఇప్పటి వరకు మొత్తం రూ. 10,22, 588లను పలు కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు విరాళాల రూపంలో కవితకు ఎన్నికల ఖర్చు కోసం అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రచారంలో మేము సైతమంటూ మద్దతు ప్రకటిస్తూ ఆమె గెలుపు కోసం కృషిచేస్తున్నారు. ఓ వైపు చేరికలు, మ రోవైపు మద్దతుల వెల్లువతో కవిత ఈసారి రికార్డు స్థా యిలో విజయాన్ని సొంతం చేసుకుంటుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నే ఎక్కడా లేని విధంగా ఆమెకు విరాళాల రూపంలో ఎన్నికల ఖర్చు కోసం అందజేయడం జిల్లా ప్రజల చైతన్యాన్ని, ఎంపీ కవిత మీద ఇక్కడి జనానికి ఉన్న అభిమానానికి తార్కాణంగా నిలుస్తున్నది.

ఇప్పటి వరకు విరాళాలు ఇవీ..
జిల్లా వంజరి సంఘం రూ. 1.16 లక్షలు, నిజామాబాద్ క్షత్రియ (పట్కరి) సమాజ్ పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానంతో పాటు రూ. 51వేలు, నగర గంగపుత్ర సంఘం ఏకగ్రీవ తీర్మానం చేస్తూ రూ. 41,150 వేలు, విరాళం చెక్కు రూపంలో అందజేశారు. టీటీఆర్ ఫౌండేషన్, నిజామాబాద్ సంపూర్ణ మద్దతు తెలుపుతూ రూ.50,116, నిజామాబాద్ డాక్టర్స్ రూ.1.16 లక్షలు, నాయీబ్రాహ్మణ సేవా సంఘం గాజుల్‌పేట్ సంపూర్ణ మద్దతు ప్రకటించి ఏకగ్రీవ తీర్మానం చేస్తూ రూ.16,666 విరాళం అందజేసింది. గంగపుత్ర సంఘం నిజామాబాద్ జిల్లా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి రూ. 25వేలు విరాళం ఇచ్చింది. జిల్లా వడ్డెర సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రూ. 21వేలు, ఆదర్శ మున్నూరు కాపు సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రూ. 11వేలు విరాళం అందజేశారు. ఆరెకటిక సంఘం రూ. 11వేలు, నిజామాబాద్ ఫాస్టర్స్ రూ. 20వేలు విరాళాలను చెక్కుల రూపంలో అందజేసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

జగిత్యాలలో..
పద్మశాలీ సంఘం రూ. 1.00,116, సీనియర్ సిటిజన్ ఫోరం రూ. 1,00,116, వడ్డెర సంఘం రూ. 50వేలు, మున్నూరు కాపు సంఘం రూ. 25వేలు, నాయీబ్రాహ్మణ సేవా సంఘం రూ. 25వేలు, రజక సంఘం రూ. 25వేలు, స్వర్ణకార సంఘం రూ. 25వేలు, రైతు సంఘం రూ. 10,116, మహిళా సంఘం రూ. 10,116, పెరిక సంఘం రూ.10,116, ఆటో యూనియన్ రూ. 10వేలు, వాటర్ ప్లాంట్ అసోసియేషన్ రూ.5,116, ఎంఏ మోహసిన్ రూ. 10వేలు, బొద్దు బుచ్చన్న రూ. 51,116, వైశ్య సంఘం రూ. 11,116.

కోరుట్లలో....
కోరుట్ల సర్పంచ్‌ల ఫోరం రూ. 25వేలు, పద్మశాలీ సంఘం రూ. 11,116, ముస్లిం మైనార్టీ సంఘం రూ. 10,232, మున్నూరు కాపు సంఘం రూ. 11,116, వెటర్నరీ కాలేజీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రూ. 5వేలు, వంజరి సంఘం రూ. 10వేలు, ముదిరాజ్ సంఘం రూ. 11వేలు, గౌడ సంఘం రూ. 10,116, క్రిస్టియన్ మైనార్టీ సంఘం రూ. 10, 116, దివ్యాంగురాలు రజిత రూ. 5వేలు.. ఇప్పటి వరకు మొత్తం రూ. 10, 22,588లను విరాళాల రూపంలో కవితకు అందజేశారు. తనకు మద్దతు తెలపడమే కాకుండా ప్రతి ఇంటి నుంచి కొంత మొత్తం డబ్బులను సేకరించి ఎన్నికల ఖర్చు కోసం తనకు చెక్కులను ఇచ్చిన సంఘం నేతలకు ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత కృతజ్ఞతలు తెలిపారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...