నాలుగో రోజు.. నామినేషన్ల జోరు


Sat,March 23, 2019 01:41 AM

నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నా మినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నెల 18న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 3వ రోజైన 20వ తేదీ న ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. 21న హోలీ పండుగ సందర్భంగా నామినేషన్లకు సెలవులు ప్రకటించారు. 22న శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణం సందడి వాతావరణాన్ని తలపించింది. నాలుగో రోజు నామినేషన్లు పెరిగాయి. శుక్రవారం ఒక్కరోజు 56 నామినేషన్లు దా ఖలయ్యాయి. శుక్రవారం నాటికి మొత్తంగా 63 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ ఉదయం ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తిరిగి మరో సెట్ దాఖలు చేశారు. ఆయన వెంట సతీమణి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, బస్వా లక్ష్మీనర్సయ్య, మచ్చల్ శ్రీనివాస్ ఉన్నారు. జిల్లాలోని కమ్మర్‌పల్లి, వేల్పూర్, బాల్కొండ తదిత ర ప్రాంతాల నుంచి రైతులు నామినేషన్లు వేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన పంటలైన పసుపు, ఎర్రజొన్న రైతులపై కేం ద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి దీటుగా జవాబు చెప్పేందుకే నామినేషన్లు వేస్తున్నట్లు రైతులు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇప్పటి వరకు 30కి పైగా రైతు లు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిసింది. మధ్యాహ్నం 2గంటల ప్రాం తంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కలెక్టరేట్ ప్రాంగణంలోకి ప్రవేశించారు. అప్పటివరకు ఎదురుచూస్తున్న జనమంతా అప్పటికప్పుడు అప్రమత్తమయ్యారు. పోలీసు, ప్రత్యేక బలగాలు కలిసి పరిస్థితిని చక్కబెట్టారు. ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ ఆంక్షలను పా టించాలనే ఉద్దేశ్యంతో పరిమిత సంఖ్యలోనే అర్హులైన వారిని లోనికి అనుమతించారు.

రెండోసారి ఎంపీగా బరిలోకి దిగను న్న కవితతో పాటు రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొ ప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, మహ్మద్ షకీ ల్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, సంజయ్‌కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, బిగాల గణేశ్ గుప్తా ఆమె వెంట ఉన్నారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేసి సుమారు 10నిమిషాల కాలవ్యవధిలోనే ఆమె తిరిగి వచ్చి విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఆకుల లలిత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ తరపున న్యాయవాది దయాకర్‌గౌడ్ ఒక సెట్ నామినేషన్ వేశారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...