టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ నాయకులు


Sat,March 23, 2019 01:41 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లా టీడీపీ అధ్యక్షుడు బాగారెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి తారాచంద్ వారి అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ చేరిన వారిలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ శాఖల బాధ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వాళ్లు పాలు, నీళ్ల్లలా కలిసిపోయి పనిచేయాలని కోరారు. ఒక మంచి ఆశయంతో పార్టీలో చేరిన వారు వారి లక్ష్య సాధనతో పాటు పార్టీ ఆశయాలను నెరవేర్చేందుకు కలిసి పని చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన విధానాన్ని దేశమంతటికీ తెలియజేసేందుకు పార్లమెంట్ ఎన్నికలను ఉపయోగించుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికే రోల్‌మోడల్ అని కవిత అన్నారు. రైతుబంధు ద్వారా రూ. 5వేలు చొప్పున రెండు పంటలకు రూ. 10వేలు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన విషయం ప్రజలకు తెలిసిందేనని, బీజేపీ దేశమంతటా ఇస్తామంటోందని అన్నారు. మన ప్రభుత్వం, మన రైతులకు కాకుండా దేశంలోని రైతులందరికీ మేలు చేసినట్లయ్యింది అని కవిత వివరించారు. మన పథకాలకు కేంద్రం డబ్బు ఇస్తోందని బీజేపీ ప్రచారం చేస్తోందని, అవాస్తవం అయిన ఈ విషయాన్ని ప్రజలకు విడమరిచి చెప్పాలని కోరారు. తెలంగాణ గోస తెలిసినోడు కేసీఆర్ అన్నారు. ఆయన పై నమ్మకం ఉంచాలన్నారు. ఎంపీ ఎన్నికల నుంచి ఎంపీటీసీ ఎన్నికల వరకు, ఏ ఎన్నికలైనా గెలుపు టీఆర్‌ఎస్ అభ్యర్థులదే అని అన్నారు.

కార్యక్రమంలో నిజామాబాధ్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, ఆకుల లలిత, టీఆర్‌ఎస్ నాయకులు రాంకిషన్‌రావు, దాదన్నగారి విఠల్‌రావు, ఈగ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...