ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్


Fri,March 22, 2019 03:22 AM

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ శు క్రవారం జరగనున్నందున పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంబంధిత సంస్థలకు శుక్రవారం సెలవు వర్తిస్తుందని ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చే సిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థ లు, పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటు అర్హత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ శుక్రవారం స్పెషల్ క్యాజువ ల్ లీవ్‌ను ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఎమ్మెల్సీ ఓటు అర్హత కలిగిన ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిపుష్టికి తమవంతు హకారం అందించాలని సూచించారు.

ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్
ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్లకు పంపిణీ చేసిన పోల్ చిట్టీల్లో పోలింగ్ సమయం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అని సాంకేతిక పొరపాటు వల్ల ప్రచురించబడిందని పేర్కొన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్లు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకే తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కేంద్రం ఆవరణలోకి వచ్చిన ఓటర్లందరినీ ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతిస్తారని తెలిపారు.

ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీ లుగా ఆయా ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు అనుమతించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు. ఓటు హక్కు కలిగి ఉం డి ప్రైవేట్, వ్యాపార సంస్థలు, పరిశ్రమల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల ల్లో పని చేసే ఉపాధ్యాయులు, అధ్యాపకు లు ఓటు హక్కు వినియోగించుకునేందు కు వీలుగా అనుమతించాలన్నారు.

గుర్తింపు కార్డులు చూపాలి
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎపిక్ కార్డు (ఓటరు గుర్తింపుకార్డు) లేని వారు ఇతర గుర్తింపు కార్డులు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఒక ప్రకటనలో సూచించారు. పోలింగ్‌కు 9 రకాల గుర్తింపు కార్డులను ఎన్నికల అధికారులు అనుమతిస్తారని చెప్పారు.

పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, సర్వీస్ ఐడెండిటీ కార్డు (ప్రభుత్వ సంస్థల అధికారులు జారీ చేసిన కార్డు), యూనివర్సిటీ జారీ చేసిన ఒరిజినల్ డిగ్రీ, డిప్లొమా సర్టిఫికెట్, దివ్యాంగులైతే ఒరిజినల్ సర్టిఫికెట్, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్, లోకల్ బాడీస్, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులైతే సంబంధిత అధికారులు జారీ చేసిన గుర్తింపు కార్డులు, ఆధార్‌కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల చేత జారీ చేసిన గుర్తింపు కార్డులు కలిగి ఉన్న అర్హత గల ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సూచించారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...