సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం


Fri,March 22, 2019 03:22 AM

బోధన్, నమస్తే తెలంగాణ: సాలూర కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలన్న సాలూర, ఆ చుట్టుపక్కల గ్రామాల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరనుంది. నిజామాబాద్‌లో రెండు రోజుల కిందట నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సభలో సీఎం కేసీఆర్ సాలూర మండలం ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటించడంతో సాలూర గ్రామస్తులు సంబురాల్లో మునిగిపోయారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి గ్రామస్తులు గురువారం పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటంతో పాటు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, బోధన్ ఎమ్మెల్యే షకీల్ చిత్రపటానికి కూడా గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్, సాలూర సర్పంచ్ చంద్రకళ, ఉప సర్పంచ్ సరిడె సాయిలు, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి షకీల్, మాజీ సర్పంచ్ రాజేశ్వర్ పటేల్, గ్రామ నాయకులు కేజీ గంగారాం, చందూర్ సాయా రెడ్డి, కన్నె సాయిలు, స్వామిగౌడ్, బిల్ల హన్మాండ్లు, ఎల్మ దత్తు, పంచాయతీ సభ్యులు కళావతి, పద్మ, రేఖ, మౌలానా, గంగామణి, గోదావరి, జ్యోతి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...