నేడే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్


Fri,March 22, 2019 03:22 AM

ఇందూరు: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా లో మొత్తం 55 పోలింగ్ స్టేషన్‌లలో పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నా రు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉపాధ్యాయులు, పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 3,078 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఉపాధ్యాయులు 1,068, పురుష ఉపాధ్యాయులు 2,010 మంది ఉన్నారు. పట్టభద్రులకు జిల్లాలో 24,173 మంది ఓటర్లు ఉండగా, 16,158 మంది పురుషులు, 8,549 మంది మహిళా ఓట ర్లు ఉన్నారు. జిల్లాలో 20 కామన్ పోలింగ్ బూత్‌లు ఉన్నా యి.

ఈ బూత్‌లలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. 26 పట్టభద్రుల పోలింగ్ స్టేషన్లు, 9 ఉపాధ్యాయ పోలింగ్ స్టేషన్లు ఉ న్నాయి. నిజామాబాద్ ఆర్డీవో కార్యాలయం, ఆర్మూర్ ఆర్డీ వో కార్యాలయం, బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయనున్నారు. కాగా, పట్టభద్రుల ఎన్నికల్లో 17 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఏడుగురు ఈసారి బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ ప్రతాలను వినియోగిస్తుండగా, పట్టభద్రుల బ్యాలె ట్ పత్రం తెలుపు, ఉపాధ్యాయ బ్యాలెట్ పత్రం గులాబీ రంగులో ఉన్నాయి. ఓటర్లు తమ పేరు చూసుకోవడానికి ceo.telangana వెబ్‌సైట్‌లోకి వెళ్లి పేరును సూచించే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత 2019 కౌన్సిల్ కాన్సిట్యూషన్‌పై క్లిక్ చేయాలి. పట్టభద్రులైతే పట్టభద్రుల నియోజకవర్గంలో, ఉపాధ్యాయులు అయితే ఉపాధ్యాయ నియోజకవర్గంలో తమ పేరును గానీ, ఇంటి పేరు గానీ నమోదు చేసి క్లిక్ చేస్తే పేరు, పోలింగ్ కేంద్రం అడ్రస్ కనిపిస్తాయి.

సీరియల్ నంబరును నోట్ చేసుకొని ఏదైనా గుర్తింపు కార్డుతో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయవచ్చు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల లాగా కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమ సంఖ్య ఉంటుంది. నచ్చిన అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఇతరులకు కూడా రెండు, మూడు, నాలుగు ఇ లా బరిలో ఉన్న వారందరికీ ఓటు వేయొచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులుగా ఇద్దరు అధికారులను నియమించా రు. వీరు ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించనున్నారు. ఈ నెల 26న ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 510 మం ది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...